Begin typing your search above and press return to search.

హర్ట్ అయితే ఏడవరా?

By:  Tupaki Desk   |   21 Sept 2017 11:03 AM IST
హర్ట్ అయితే ఏడవరా?
X
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది బ్యూటీ దీక్షా పంత్. ఆమె రాకతో షోకు ఓ రకంగా గ్లామర్ కంటెంట్ వచ్చింది. ఎంత ప్రయత్నించినా హౌస్ మేట్స్ తో అంతగా కలవలేకపోయింది. చివరకు ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా బయటకు పంపే విషయంలో తనపట్ల చాలా అమానవీయంగా ప్రవర్తించారంటూ ఈ సుందరి ఈ బాధ పడుతోంది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ప్రవర్తన తనను ఏ రేంజిలో హర్ట్ చేసిందో ఓ టీవీ షోలో కంటతడి పెట్టుకుని మరీ చెప్పింది.

బిగ్ బాస్ ప్రోగ్రాంలో ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. ఆ ప్రకారం బయటకు వచ్చేటప్పుడు తనతో కనీసం మర్యాదపూర్వకంగా ప్రవర్తించకపోవడం ఏమిటన్నది దీక్ష ప్రశ్న. పైపెచ్చు వెళ్లిరావమ్మా అమ్మోరమ్మా అంటూ తనను వెటకారం చేస్తూ పంపడం తనను బాగా హర్ట్ చేసిందని అంటోంది. వేరొకరు బయటకు వెళ్లే సందర్భంలో తానయితే అలా ప్రవర్తించనని.. ఇన్నాళ్లపాటు కలిసున్న వ్యక్తి వెళ్లిపోతుంటే చాలా దారుణంగా బిహేవ్ చేశారని దీక్ష చెప్పుకొచ్చింది.

తన మనసుకు కష్టం కలిగి కంటతడి పెట్టుకున్నా సింపతీ కోసం అలా చేస్తున్నానని కామెంట్ చేశారని దీక్ష ఆవేదన వ్యక్తం చేసింది. ఫీలింగ్స్ హర్ట్ అయితే బాధ కలగదా అని ప్రశ్నించింది. తనకు ఎవరి సింపతీ అవసరం లేదని తేల్చి చెప్పింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక తాను ఎవ్వరినీ నమ్మడం లేదని క్లియర్ కట్ గా చెబుతోంది. సో.. బిగ్ బాస్ ప్రోగ్రాం దీక్షను బాగానే మార్చిందన్న మాట.