Begin typing your search above and press return to search.

మ్యారేజ్ ఇన్నింగ్ కి యువీ రెడీ!

By:  Tupaki Desk   |   20 Sep 2016 8:01 AM GMT
మ్యారేజ్ ఇన్నింగ్ కి యువీ రెడీ!
X
ప్ర‌ముఖ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. న‌టి హేజ‌ల్ కీచ్ ను పెళ్లాడ‌బోతున్నాడు. హేజ‌ల్‌తో త‌న ప్రేమాయ‌ణం గురించి ఒక టీవీ షోలో చెప్పాడు. నిజానికి, కొన్నాళ్ల కింద‌టే ఈ ఇద్ద‌రికీ బాలీలో నిశ్చితార్థం కూడా జ‌రిగింది. ఆ విష‌యాన్ని కాస్త ర‌హ‌స్యంగా ఉంచుతూ వ‌చ్చాడు. క‌పిల్ శ‌ర్మ కామెడీ షోలో యువీ - హేజ‌ల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ లో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు యువీ చెప్పాడు. అంతేకాదు, వారిద్ద‌రి మ‌ధ్యా ప్రేమ ఏ విధంగా చిగురించిందో.. ఆ త‌రువాత పెద్ద‌ల‌ను ఏ విధంగా ఒప్పించాడో అన్నీ పూస‌గుచ్చిన‌ట్టు చెప్పాడు.

మొద‌ట్లో హేజ‌ల్ తో మాట్లాడ‌ట‌మే గ‌గ‌నం అయిపోయేద‌న్నాడు. ఆమెని స‌ర‌దాగా కాఫీకి ఇన్వైట్ చేస్తే వ‌స్తాన‌ని చెప్పేదనీ, వెంట‌నే ఫోన్ స్విఛాఫ్ చేసేందని, ఆమె వ‌స్తుంద‌ని ఎదురుచూపులే మిగిలేవ‌నీ యువీ చెప్పాడు. దాదాపు మూడేళ్ల పాటు హేజ‌ల్ ప్రేమ కోసం యువీ ప్ర‌య‌త్నాలు చేశాడ‌ట‌. చిట్ట చివ‌రికి త‌న విష‌యంలో యువీ సీరియ‌స్‌ గానే ఉన్నాడ‌ని నిర్ణ‌యించుకున్నాక‌నే హేజ‌ల్ మాట్లాడ‌టం మొద‌లుపెట్టిందని చెప్పాడు. ఒక వెబ్ సైట్ ద్వారా ఈ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం కుదిరింది. ఆ త‌రువాత‌, ఇద్ద‌రి కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం, రెండు కుటుంబాలు పెళ్లికి ఎలాంటి అంభ్య‌త‌రాలు తెల‌ప‌క‌పోవ‌డంతో త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారు.

చిత్రం ఏంటంటే... యువ‌రాజ్ సింగ్ అన‌గానే అంద‌రికీ తెలిసిన విష‌యం ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు కొట్టిన రికార్డు! ఆ విష‌యం ఇంత‌వ‌ర‌కూ హేజ‌ల్ కి తెలీద‌ట‌! ఇంగ్లండ్ జ‌ట్టుపై యువీ సాధించిన ఈ రికార్డు గురించి టీవీ షోలో క‌పిల్ శ‌ర్మ అడిగితే... హేజ‌ల్ త‌న‌కు తెలీద‌ని స‌మాధానం చెప్పింది. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ప్ర‌పంచ రికార్డు సాధించింది నీ కాబోయే భ‌ర్తే అనేస‌రికి ఆమె ఆశ్య‌ర్యంతో ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బు అయిపోయింది! ఇన్నాళ్ల యువీ ప్రేమ‌లో ఈ విష‌యం ఆమెకి తెలీకుండా ఉందా... ఆశ్చ‌ర్య‌మే!