Begin typing your search above and press return to search.

'లీడర్ ఆఫ్ ది ప్యాక్' అంటూ మాస్ రాజా మూవీపై ఇంటరెస్టింగ్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   29 Jun 2021 11:00 PM IST
లీడర్ ఆఫ్ ది ప్యాక్ అంటూ మాస్ రాజా మూవీపై ఇంటరెస్టింగ్ అప్డేట్..!
X
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఇండస్ట్రీలో నూతన దర్శకులకు అవకాశం ఇచ్చే హీరోలలో రవితేజ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అయితే ఈ ఏడాది రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో దర్శకుడు రమేష్ వర్మతో ఖిలాడి మూవీ చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ ఇది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడు. అలాగే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో కూడా సూపర్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది.

అయితే ఖిలాడి లైన్ లో ఉండగానే మాస్ రాజా.. శరత్ మండవ అనే నూతన దర్శకుడితో తదుపరి సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లో 69వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ప్లాన్ చేసాడు శరత్. ఆల్రెడీ పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో రవితేజ చిత్తూరు యాసలో మాట్లాడతాడని ఇదివరకు న్యూస్ వచ్చింది.

కానీ ఈసారి దర్శకుడు శరత్ స్వయంగా సినిమా పై అంచనాలు పెంచే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ సినిమా విషయంలో శరత్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. తాజాగా శరత్ సినిమాకు సంబంధించి న్యూ పోస్టర్ రిలీజ్ చేసాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. పోస్టర్ లో రవితేజ లుక్ ఏర్పడకుండా జాగ్రత్తపడ్డారు. అందుకే పిక్చర్ బ్లర్ చేశారు కానీ ఇంటరెస్టింగ్ లైన్ తో ఆసక్తి రేపాడు. 'లీడర్ ఆఫ్ ది ప్యాక్' అనే లైన్ తో పోస్టర్ పై ఇంటరెస్ట్ పెంచేసారు. అయితే ఇప్పుడు సినిమా టైటిల్ కూడా లీడర్ టైప్ ఉండబోతుందేమో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి త్వరలో క్లారిటీ ఇస్తాడేమో.. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా ఖరారైంది. చెరుకూరి సుధాకర్ సినిమాను నిర్మించనున్నాడు.