Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో సన్నీ లియోన్ కండోమ్ యాడ్ పై చర్చ
By: Tupaki Desk | 2 Aug 2017 12:40 PM ISTపోర్న్ స్టార్ సన్నీలియోన్ గురించి పరిచయం అవసరం లేదు. నీలిచిత్రాల గురించి కాస్త తెలిసిన వారికి కూడా సన్నీలియోన్ గురించి పూర్తిగా తెలుసు! వయసులో ఉన్న అబ్బాయిలు మొదలుకొని సినీ ఇండస్ట్రీ వరకు అంతా అమ్మడు గురించి చర్చించుకుంటారు. అంత పాపులర్ అయిన సన్నీలియోన్ తాజాగా అసెంబ్లీలో కూడా చర్చకు వేదికగా మారింది. సన్నీలియోన్ నటించిన కండోమ్ యాడ్ ఏకంగా అసెంబ్లీ చర్చకు దారితీసింది.
మ్యాన్ ఫోర్స్ అనే కండోమ్ యాడ్‌లో సన్నీ లియోన్ నటించింది. ఈ యాడ్ ను రూపొందించిన కంపెనీతో రాష్ట్ర రవాణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకేముంది రాష్ట్రంలో తిరిగే బస్సుల్లో సన్నీ నటించిన హాట్ హాట్ సీన్లతో కూడిన యాడ్స్ బస్సులో ప్రసారం అవుతున్నాయి. ఇదే విషయమై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సెయింట్ ఆండ్ర్యూ ఫ్రాన్సిస్ సిల్వేరియా సభలో ప్రస్తావించారు. ఈ యాడ్ ను ప్రసారాలను తక్షణమే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
``బస్సుల్లో విద్యార్థులు - సామాన్యులు - మహిళలు అందరూ ప్రయాణిస్తుంటారు. అలాంటి సమయంలో ఈ కండోమ్ యాడ్ ప్రసారం చేయడం ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాం? గోవా ప్రజలు ఈ చర్యలను ఏ విధంగా చూస్తాయి? అతిథులు ఎవరైనా మన రాష్ట్రం గురించి ఏమనుకుంటారు?`` అంటూ తక్షనమే ఈ కండోమ్ యాడ్ ప్రసారాన్ని నిలిపివేయాలని కోరారు.
