Begin typing your search above and press return to search.

RRR హైప్ కి త‌గ్గ‌ట్టు పాత్ర‌ల ఎలివేష‌న్ పై డిబేట్

By:  Tupaki Desk   |   6 April 2021 6:30 AM GMT
RRR హైప్ కి త‌గ్గ‌ట్టు పాత్ర‌ల ఎలివేష‌న్ పై డిబేట్
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఈ ఏడాది రిలీజ్ కి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీగా రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెసిందే. రౌద్రం ర‌ణం రుధిరం అంటూ భారీ స్పాన్ ఉన్న విశేష‌ణాల‌తో టైటిల్ ని ఎంపిక చేయ‌డం ఆ త‌ర్వాత ఆ పాత్ర‌ల‌కు అంత పెద్ద ఎలివేష‌న్ ఇవ్వ‌డం చూస్తుంటే అభిమానుల్లో అంచ‌నాలు పీక్స్ కి చేరిపోయాయి. అయితే ఆ స్థాయిలోనే విజువ‌ల్ ఎలివేష‌న్ ఉంటుందా? అంటే దానికి జ‌క్క‌న్న నుంచి స‌మాధానం ప్రాక్టికల్ గానే చూడాలి.

ఒక పాత్ర‌లో రౌద్రం థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లేలా చేస్తుంది. ఇంకో పాత్ర‌లో ర‌ణం భారీ యాక్ష‌న్ తో గ‌గుర్పాటుకు గురి చేస్తుంది. రుధిరం అంటే ర‌క్తం అని అర్థం ఉంది. ఇందులో వార్ స‌న్నివేశాల‌కు కొద‌వే లేదు కాబ‌ట్టి రుధిరం ధార‌లైన పార‌డం ఖాయం. ఇక చ‌ర‌ణ్ (అల్లూరి) .. తార‌క్ (కొమ‌రం భీమ్‌) పాత్ర‌ల్ని ప‌రిశీలిస్తే రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ల‌లోనే బోలెడంత హైప్ పెంచారు. ఒక‌రు జ‌ల‌విల‌యంలా విరుచుకుప‌డితే.. మరొక‌రు మీద ప‌డితే దావాన‌ల‌మే అన్నంత క‌ల‌రింగ్ ఉంది. బ‌హుశా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఒక పాత్ర‌కు ఇంత హైప్ లేనే లేద‌ని చెప్పాలి. ఇక ఇందులోనే యంగ్ టైగ‌ర్ ఏకంగా పెద్ద పులితోనే పోరాడే స‌న్నివేశాన్ని ప్లాన్ చేశారంటే అంచ‌నాలు ఏ రేంజులో ఉంటాయో అర్థం చేసుకోవాలి.

ఇటీవ‌ల‌ చరణ్ పోస్టర్ తో సంభాష‌ణ‌లు ఆస‌క్తిక‌రం. ``ఆయన ధైర్యానికి చిహ్నం. అతను గౌరవాన్ని నిర్వచిస్తాడు. అతను చిత్తశుద్ధితో నిలుస్తాడు`` అంటూ ఎలివేష‌న్ ఇచ్చారు. ఆలియా పోస్ట‌ర్ తో `రామరాజు కోసం సీత‌ నిరీక్షణ` అంటూ హైప్ చేశారు. ఇలాంటి భారీ శీర్షికలు పాత్రలపై అంచ‌నాల్ని పెంచేస్తాయి. ఈ అసాధారణ శీర్షికల మాదిరిగానే అసాధారణమైన పాత్రలను ఆశిస్తూ ప్రేక్షకులు థియేటర్లకు వ‌స్తారు.

కానీ ఈ పాత్ర‌లో ఎలివేషన్ కి స్కోప్ ఏమాత్రం త‌గ్గినా ఆ నిర్దిష్ట స్టార్ అభిమానులు నిరాశ చెందవచ్చు. అన‌వ‌స‌ర‌మైన హైప్ కొన్నిసార్లు ఇబ్బందిక‌రంగానూ మార‌వ‌చ్చు. పైగా మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న చ‌ర‌ణ్ .. తార‌క్.. దేవ‌గ‌న్ .. ఆలియా వంటి స్టార్ల‌తో ఇలాంటి ప్ర‌యోగం ఇంకా క‌త్తి మీద సాములాంటిద‌ని విశ్లేష‌ణ సాగుతోంది. నెటిజ‌నుల్లోనూ ఈ భారీ హైప్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అక్టోబ‌ర్ లో 2021 ఆర్.ఆర్.ఆర్ ప్ర‌పంచంలోని చాలా భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.