Begin typing your search above and press return to search.

పుష్ప సక్సెస్ పార్టీలో అత‌డి పెళ్లిపైనే గుస‌గుస‌

By:  Tupaki Desk   |   4 Jan 2022 8:30 AM GMT
పుష్ప సక్సెస్ పార్టీలో అత‌డి పెళ్లిపైనే గుస‌గుస‌
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మందన్న జంట‌గా సుకుమార్ తెర‌కెక్కించిన `పుష్ప: ది రైజ్` 300కోట్ల క్ల‌బ్ లో చేరుతున్న ఈ శుభ‌వేళ ఘ‌న‌విజయాన్ని టీమ్ అస్వాధిస్తోంది. సోమవారం రాత్రి సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్ లో చిన్న పార్టీలో చిలౌట్ చేసింది.

ఈ పార్టీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ -శ్రీ‌వ‌ల్లీ అలియాస్ రష్మిక మందన్న- సుకుమార్ దంపతులు- అజయ్- అనసూయ భరద్వాజ్- సునీల్- జానీ మాస్టర్- జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వేడుక ఆద్యంతం ర‌ష్మిక మంద‌న జోష్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా.. దేవీశ్రీ‌లో ఎన‌ర్జిటిక్ వేవ్స్ క్రియేట‌వ్వ‌డం క‌నిపించింది.

ఈ వేడుక‌లో దేవీశ్రీ మ్యారేజ్ ప్లాన్ పైనా గుస‌గుస‌లు వినిపించాయి. పుష్ప కు ముందే దేవీశ్రీ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడేయ‌బోతున్నాడ‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అయ్యాయి. కానీ స్టిల్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గానే దేవీ ఉన్నాడు. క‌నీసం 2022లో అయినా పెళ్లి మాటెత్తుతాడేమో చూడాలి! అంటూ పార్టీలో ఒక వైపు మ‌ర్మ‌రింగ్ హీటెక్కించింది. దేవీశ్రీ ఏజ్ 42.. కానీ ఇంకా సిక్స్ టీన్ లా చెల‌రేగే ఎన‌ర్జీ ఉంది.. కానీ పెళ్లి మాటెత్త‌డేమిటో!! అంటూ గుస‌గుసా వేడెక్కించింది. ఇక పుష్ప - ది రైజ్ చిత్రానికి దేవీశ్రీ ప్ర‌సాద్ అందించిన రాకింగ్ సాంగ్స్.. అద్భుత‌మైన రీరికార్డింగ్ పెద్ద ప్ల‌స్ అయ్యింది. ఆర్.ఆర్ - బీజీఎంతోనే అత‌డు పుష్ప‌కు ప్రాణం పోసాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.