Begin typing your search above and press return to search.

డియ‌ర్ మేఘ ట్రైల‌ర్: ముక్కోణ ప్రేమ‌క‌థ‌లో ఘాడ‌త క‌దిలిస్తోంది

By:  Tupaki Desk   |   30 Aug 2021 2:51 AM GMT
డియ‌ర్ మేఘ ట్రైల‌ర్: ముక్కోణ ప్రేమ‌క‌థ‌లో ఘాడ‌త క‌దిలిస్తోంది
X
ప్రేమ దేశం- ప్రేమికుల రోజు - తొలి ప్రేమ‌- నువ్వు లేక నేను లేను.. ఇవ‌న్నీ ప్రేమ‌క‌థా చిత్రాల్లో క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. 90ల‌లో 2000 నాటికి అప్ప‌టి యూత్ కల్చ‌ర్ ని నాటి జ‌న‌రేష‌న్ ప్రేమ‌క‌థ‌ల్ని ఆవిష్క‌రించాయి. ఈ సినిమాలన్నీ ఫీల్ గుడ్ ప్రేమ‌క‌థ‌ల‌తో ఆక‌ట్టుకున్నాయి.

ల‌వ్ ఫీల్ అంటే ఇంత‌టి డీప్ ఇంటెన్సిటీతో ఉంటుందా? అనేంత ఘాడ‌త‌ను తెర‌పై ఆవిష్క‌రించారు. కానీ ఇటీవ‌లి కాలంలో డీప్ ఇంటెన్స్ ల‌వ్ స్టోరీస్ ఏవీ తెలుగులో క‌నిపించ‌లేదు. అన్ని సినిమాల్లో ప్రేమ‌క‌థ‌లు ఉన్నా ఘాడంగా హ‌త్తుకునే ప్రేమ క‌థ‌లు లేనే లేవు.

ప్రేమ‌దేశంలో ముక్కోణ ప్రేమ‌క‌థ యువ‌త‌రం గుండెల్లో ల‌బ్ డ‌బ్ పెంచేంత ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది. ఆ త‌ర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన `చెలి` చిత్రంలో అంత‌టి ఘాడ‌త ఉంటుంది. కానీ ఇటీవ‌లి కాలంలో అలాంటి డీప్ ఇంటెన్స్ ల‌వ్ స్టోరీలేవీ రాలేదు అనుకుంటుండ‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ - అర్జున్ రెడ్డి డీప్ ర‌గ్గ్ డ్ ల‌వ్ స్టోరీతో ఆక‌ట్టుకుంది. `మ‌జిలీ`లోనూ డీప్ ఇంటెన్స్ ల‌వ్ ఆక‌ట్టుకుంటుంది.

కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ మాంచి ఫీల్ గుడ్ ఇంటెన్స్ ల‌వ్ స్టోరీని చూపించేందుకు `డియ‌ర్ మేఘ` లాంటి ప్ర‌య‌త్నం ఒక‌టి క‌నిపిస్తోంది. మేఘా ఆకాష్ - క‌థ ఫేం ఆదిత్ అరుణ్- అర్జున్ సోమ‌యాజుల నాయ‌కానాయిక‌లుగా సుశాంత్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ సినిమా ముక్కోణ ప్రేమ‌క‌థ‌తో గుండెల్ని ట‌చ్ చేస్తోంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఎమోష‌న‌ల్ ల‌వ్ ఇంటెన్సిటీ ఆక‌ట్టుకుంటోంది. మేఘలో యూత్ ఫుల్ ఎలిమెంట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాగా ఆదిత్.. అర్జున్ సోమ‌యాజుల‌ పోటీ ప‌డి న‌టించ‌డం ఆక‌ట్టుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల న‌డుమ దోబూచులాడే ప్రేమ‌క‌థ ఇది అని అర్థ‌మ‌వుతోంది. వెయ్యి మంది క‌త్తుల‌తో పొడిచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది... లైఫ్ అంద‌రికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వ‌దు.. ! అంటూ ఎమోష‌న‌ల్ గ్రాఫ్ ని రైజ్ చేసే అద్భుత‌మైన డైలాగ్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఫీల్ ని క్యారీ చేసే మ్యూజిక్ కుదిరింది.

అర్జున్‌ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయింది. సెప్టెంబర్ 3న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. చ‌క్క‌ని అనుభూతికి గురిచేసే ఓ మంచి ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది. ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా భావోద్వేగాలు ఉంటాయని నిర్మాత తెలిపారు. 300 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నామ‌ని అన్నారు. హరి గౌర సంగీతం అందించ‌గా.. ఆండ్రూ ఛాయాగ్రహణం అందించారు.