Begin typing your search above and press return to search.

''డియర్ మేఘ'' విడుదల తేదీ ఖరారు..!

By:  Tupaki Desk   |   18 Aug 2021 7:30 AM GMT
డియర్ మేఘ విడుదల తేదీ ఖరారు..!
X
మేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''డియర్ మేఘ''. ఇందులో అర్జున్ సోమయాజుల మరో కీలక పాత్రల్లో నటించారు. డెబ్యూ డైరెక్టర్ సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కి రెడీ చేశారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

''డియర్ మేఘ'' సినిమా ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెడీగా ఉన్నా.. థియేటర్ రిలీజ్ కోసం చిత్ర నిర్మాతలు వెయిట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న చిత్రాలకు రెస్పాన్స్ బాగుండటంతో ''డియర్ మేఘ'' చిత్రాన్ని కూడా సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్యూర్ ఎమోషనల్ ప్రేమ కథగా ''డియర్ మేఘ'' చిత్రాన్ని దర్శకుడు సుశాంత్ రెడ్డి తెరకెక్కించారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ భావోద్వేగ ప్రేమ కథలో మేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ - అర్జున్ సోమయాజులు ఫర్మార్మెన్స్ ప్రేక్షకుల మనసును కదిలించబోతోంది.. ఈ సినిమా ఒక జెన్యూన్ లవ్ ఫీల్ ను ఆడియెన్స్ కు కలిగిస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా చెబుతున్నారు.

''డియర్ మేఘ'' చిత్రానికి హరి గౌర అందించిన పాటలు ఇప్పటికే హిట్ కాగా.. ప్రచార చిత్రాలు - టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. పీఎస్ వర్మ ఆర్ట్ డైరెక్టర్ గా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.