Begin typing your search above and press return to search.

కామ్రేడ్ కు భరత్ బూచి

By:  Tupaki Desk   |   25 March 2019 10:55 AM IST
కామ్రేడ్ కు భరత్ బూచి
X
వరస సక్సెస్ లతో బలమైన మార్కెట్ తో పాటు ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ రాబోయే సినిమా డియర్ కామ్రేడ్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఒకేసారి సౌత్ లో నాలుగు భాషల్లో విడుదలకు ప్లాన్ చేయడంతో బిజినెస్ పరంగా భారీ ఫిగర్స్ నమోదవుతున్నాయి. మే 31 డేట్ లాక్ చేశారు కాబట్టి దాని గురించి అభిమానులకు ఎలాంటి టెన్షన్ లేదు.

ఈ మధ్య టాలీవుడ్ నిర్మాతలు చాలా ముందస్తు ప్లానింగ్ తో అనవసరమైన పోటీకి దిగకుండా సేఫ్ గా ఓపెనింగ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా వరసగా ఏప్రిల్ లో వారానికి ఒకటి చొప్పున వస్తున్న సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే మే 31న డియర్ కామ్రేడ్ తప్ప తెలుగు నుంచి ఇంకే పోటీ లేదు కానీ మరోరూపంలో ఇంకో బూచి ఎదురు చూస్తోంది

సల్మాన్ ఖాన్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న భరత్ జూన్ 5న విడుదల చేసేందుకు ప్రణాళిలు సిద్ధమయ్యాయి. కత్రినా కైఫ్ హీరోయిన్ గా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తీస్తున్న ఈ మూవీలో దిశా పటాని సల్లుకి చెల్లిగా నటిస్తోంది. వచ్చే నెల ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే డియర్ కామ్రేడ్ వచ్చిన వారం లోపే భరత్ వచ్చేస్తుంది.

గ్యాప్ కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఏ సెంటర్స్ లో ఖచ్చితంగా ప్రభావం చూపించేదే. అప్పటికి కామ్రేడ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఉంటే ఏ సమస్యా లేదు. ఏదైనా తేడా వస్తే సల్మాన్ సునామిలా బాక్స్ ఆఫీస్ ని కమ్మేస్తాడు. పోయిన ఈద్ కి రేస్ 3 దారుణంగా దెబ్బ తీసిన నేపథ్యంలో సల్మాన్ ఫాన్స్ కు దీని మీద మాములు అంచనాలు లేవు. తక్కువ గ్యాప్ లో ఈ కామ్రేడ్ భరత్ ల మధ్య యుద్ధం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది