Begin typing your search above and press return to search.

కామ్రేడ్ ప్రేమ సరాగం - వీడియో సాంగ్

By:  Tupaki Desk   |   15 May 2019 6:35 AM GMT
కామ్రేడ్ ప్రేమ సరాగం - వీడియో సాంగ్
X
గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తొలుత ఈ నెలాఖరున రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ అప్పటికీ వర్క్ పూర్తయ్యే ఛాన్స్ లేకపోవడంతో రెండు నెలల వాయిదాకు నిర్ణయం తీసుకుని జులైకు షిఫ్ట్ చేశారు.

ఇంకా టైం ఉన్నా కామ్రేడ్ ప్రమోషన్ విషయంలో స్పీడ్ గానే ఉన్నాడు. ఇందులో కదలల్లె వేచేను కనులే కదిలాను నదిలా కలలే అంటూ సాగే పాట తాలూకు వీడియో సాంగ్ ని యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే హిట్ మెలోడీగా యూత్ లో నానుతున్న ఈ సాంగ్ ఇప్పుడు ఏకంగా విజువల్స్ తో సహా వచ్చేయడంతో ఫ్యాన్స్ ఆనందం ఓ రేంజ్ లో ఉంది

పాట మొత్తం వర్షం నేపథ్యంలో విజయ్ రష్మికల మధ్య కూల్ లవ్ కెమిస్ట్రీకి అద్దం పట్టేలా ఉంది. మెట్లపై నుంచి తడుస్తూ విజయ్ దేవరకొండ కిందకు వస్తూ ఉండగా అప్పటిదాకా గొడుగుతో చినుకులను తప్పించుకున్న రష్మిక మందన్న ఒక్కసారిగా విజయ్ ని చూడగానే ఆనందంతో అది ఎగరేసి అతనివైపుకు వెళ్లిపోవడం చక్కని రొమాన్స్ ని ప్రెజెంట్ చేసింది.

ఇద్దరి మధ్యా జరిగే పరిచయం కలిగిన ఎడబాటు కాలేజీలో పంచుకున్న మధుర క్షణాలు అన్ని చక్కగా కుదిరాయి. మొత్తానికి కామ్రేడ్ ప్రేమ ఏ స్థాయిలో ఉండబోతోంది ఇందులో చక్కగా చూపించారు. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న డియర్ కామ్రేడ్ ని మైత్రి సంస్థ బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి .