Begin typing your search above and press return to search.

నంది అవార్డులు: అతనే పెద్ద సర్ప్రైజ్

By:  Tupaki Desk   |   2 March 2017 7:22 AM GMT
నంది అవార్డులు: అతనే పెద్ద సర్ప్రైజ్
X
నంది అవార్డుల గురించి అందరూ మరిచిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పురస్కారాల్ని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఐతే ఇప్పుడు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో లేదు. పైగా అవార్డులు ప్రకటించింది 4-5 ఏళ్ల ముందు సినిమాలకు దీంతో ఒకప్పుడు నంది అవార్డులు ప్రకటిస్తే ఉన్నంత ఎగ్జైట్మెంట్ ఇప్పుడు లేదు. టాలీవుడ్ సెలబ్రెటీలు కానీ.. సామాన్య జనం కానీ ఈ అవార్డులపై అంతగా స్పందించట్లేదు. సోషల్ మీడియాలో కూడా దీని గురించి పెద్ద చర్చ నడవట్లేదు.

మామూలుగా నంది అవార్డులు ప్రకటించినపుడు.. సరైన వాళ్లకే అవి ఇచ్చారా అన్న డిస్కషన్ నడుస్తుంది. మిగతా సినిమాలు.. మిగతా నటీనటులు.. టెక్నీషియన్స్ ఎవరు పోటీలో ఉన్నారు.. వాళ్లను కాదని వీళ్లకు అవార్డులివ్వడం సమంజసమేనా అన్న చర్చ ఉంటుంది. ఐతే 2012-13 సంవత్సరాల్లో ఏయే సినిమాలొచ్చాయి అన్నది జనాలకు ఇప్పుడు అంతగా గుర్తు లేదు. దీంతో పైన చెప్పుకున్న చర్చ అంతగా లేదు. ఇక అవార్డులు అందుకున్న వాళ్లలో కూడా ఏమంత ఎగ్జైట్మెంట్ అయితే కనిపించట్లేదు.

ఉత్తమ నటులుగా ఎంపికైన ప్రభాస్.. నాని.. 2011 సంవత్సరానికి ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్న రాజమౌళి.. ఇంకా చాలామంది గత కొన్నేళ్లలో చాలా ఎదిగిపోయారు. పైగా అవార్డులు చాలా లేటుగా వచ్చాయి. కాబట్టి వారిలో అంత ఎగ్జైట్మెంట్ కనిపించలేదనే చెప్పాలి. ఐతే అందర్లోకి ఎక్కువ ఎగ్జైట్ కావడానికి అవకాశమున్నది మాత్రం దయా కొడవగంటినే. ఇతను 2013 సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ పేరు అవార్డుల జాబితాలో మోస్ట్ సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. అసలా దర్శకుడు ఎవరు.. ఏ చిత్రానికి అవార్డు అందుకున్నాడని ముందు జనాలు వెతుకులాట ప్రారంభించారు.

దయా అవార్డు అందుకున్నది ‘అలియాస్ జానకి’ అనే సినిమాకు. అది ‘పంజా’ నిర్మాత నీలిమ తిరుమల శెట్టి నిర్మించిన చిత్రం. సినిమా వచ్చింది తెలియదు.. వెళ్లింది తెలియదు. అనీషా ఆంబ్రోస్ కథానాయికగా పరిచయమైంది ఈ చిత్రంతోనే. ఇదే దర్శకుడు గత ఏడాది ‘సిద్దార్థ’ అనే సినిమా తీశాడు. అది కూడా ఆడలేదు. తన సినిమాలు ఆడకున్నా.. తొలి చిత్రంతోనే ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నందుకు చాలా ఎగ్జైట్ అవుతూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు దయా. ఇతను పవన్ కళ్యాణ్ దగ్గర కూడా కొంత కాలం పని చేయడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/