Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ హైదరాబాదీ ఆటో జర్నీ

By:  Tupaki Desk   |   12 April 2019 10:28 AM GMT
ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ హైదరాబాదీ ఆటో జర్నీ
X
ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ అయిన డేవిడ్‌ వార్నర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌ లు ఆడేందుకు ఇండియాకు వచ్చాడు. ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడుతున్న డేవిడ్‌ వార్నర్‌ తాజా మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాడు. ఆ సందర్బంగా కూతురు ఇవీ మే కలిసి సరదాగా ఆటో జర్నీ చేశాడు. వార్నర్‌ తల్చుకుంటే కారులో హైదరాబాద్‌ చుట్టేసి రాగలడు. కొత్త అనుభూతి కోసం వార్నర్‌ ఆటో జర్నీ చేశాడు. కూతురుతో కలిసి వార్నర్‌ హైదరాబాద్‌ లోని పలు ప్రదేశాలకు వెళ్లాడట.

పలు చోట్ల షాపింగ్‌ కూడా చేశారట. రోడ్డు సైడ్‌ ఉన్న ఫుడ్‌ ను తినడంతో పాటు - రోడ్డు సైడ్‌ ఉన్న వస్తువులను కూడా షాపింగ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. వార్నర్‌ హైదరాబాద్‌ ఆటో ప్రయాణం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే చెన్నైలో ఒక క్రికెటర్‌ లుంగీ కట్టుకుని రోడ్డు సైడ్‌ బేరం ఆడి మరీ షాపింగ్‌ చేసిన విషయం మర్చి పోకముందే వార్నర్‌ సింప్లిసిటీని చాటుకుంటూ ఆటో ప్రయాణం చేయడం జరిగింది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న వార్నర్‌ పలు మ్యాచ్‌ లలో మ్యాచ్‌ విన్నర్‌ గా నిలిచాడు.