Begin typing your search above and press return to search.

వీడియో : ఈసారి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం

By:  Tupaki Desk   |   25 Nov 2020 10:30 AM GMT
వీడియో : ఈసారి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం
X
ఈమద్య కాలంలో డేవిడ్‌ వార్నర్‌ తెలుగు ప్రేక్షకుల దృష్టిని నెటిజన్స్‌ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే మహేష్‌ బాబు.. ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌ వీడియోలతో సందడి చేసిన వార్నర్‌ ఇటీవలే బుట్టబొమ్మ పాటకు 450 మిలియన్‌ వ్యూస్‌ రావడంపై స్పందిస్తూ వెల్ డన్‌ అంటూ బన్నీకి కామెంట్‌ పెట్టాడు. ఆ పోస్ట్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు తెగ నచ్చింది. వార్నర్‌ పోస్ట్‌ ను బన్నీ అభిమానులు ట్రెండ్‌ చేశారు. బన్నీ పాట గురించి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌ అది కూడా ఒక ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ షేర్‌ చేయడం తెలుగు వారి అందరికి గర్వకారణం అంటూ బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈసారి డేవిడ్‌ వార్నర్‌ మరో వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో ఎన్టీఆర్‌ అరవింద సమేత లో ని యాక్షన్‌ సీన్‌ ను షేర్‌ చేశాడు. ఎన్టీఆర్‌ ఫేస్‌ లో తన ఫేస్‌ ను మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేశాడు. ఇది ఒకసారి చూడండి ఎలా మారిందో.. మీరు ఎవరైనా దీనికి గుర్తించగలరా ఎవరు అనే విషయం గుర్తించారా అంటూ ప్రశ్నించాడు. మొత్తానికి ఎన్టీఆర్‌ ఫేస్‌ తో వార్నర్‌ ఫేస్‌ తో మార్ఫింగ్‌ చేయడం తో నందమూరి అభిమానులు ప్రస్తుతం ఆ వీడియోను షేర్‌ చేస్తున్నారు.