Begin typing your search above and press return to search.

ఏయ్ బిడ్డా.. పుష్ప లుక్ లో వార్న‌ర్ దుమారం!

By:  Tupaki Desk   |   11 Dec 2021 4:30 PM GMT
ఏయ్ బిడ్డా.. పుష్ప లుక్ లో వార్న‌ర్ దుమారం!
X
ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ ఇన్ స్టా సంద‌డి గురించి తెలిసిందే. అత‌డు తెలుగు స్టార్ల‌ను ఇమ్మిటేట్ చేస్తూ చేసే వీడియోలు అంత‌ర్జాలంలో ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా అత‌డు ఇన్ స్టాగ్రామ్ లో మ‌రో ఉల్లాసకరమైన వీడియోను పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో వార్నర్ .. అల్లు అర్జున్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి భర్తీ చేసాడు. తరువాత ఇన్ స్టాగ్రామ్ లో వార్నర్ పోస్ట్ కు ప్రత్యుత్తరం ఇచ్చాడు విరాట్ కోహ్లీ.

ఇటీవలే ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా యాషెస్ ఓపెనర్ ను గెలవడంలో సహాయపడిన డేవిడ్ వార్నర్ .. తీరిక స‌మ‌యాన్ని మ‌రోసారి స‌ద్వినియోగం చేస్తూ.. అల్లు అర్జున్ డ్యాన్సింగుల‌తో మార్ఫింగ్ వీడియోను పోస్ట్ చేసారు. ఇది పుష్ప లో సాంగ్ బిట్. ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా..! అంటూ సాగే ఈ మాస్ సాంగ్ లో వార్న‌ర్ ఛ‌మ‌క్కులు క‌డుపుబ్బా న‌వ్విస్తున్నాయి.

ఈ వీడియోకు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి వార్నర్ సాధారణ సోషల్ మీడియా వినియోగదారుగా మారాడు. మార్ఫింగ్ వీడియోలతో అతడు గొప్ప‌గా ప్రసిద్ధి చెందాడు. ఈ పోస్ట్ కి విరాట్ కోహ్లీ నుండి ఒక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య కూడా వచ్చింది. మేట్ బాగున్నారా? అంటూ కోహ్లి వ్యాఖ్యతో పాటు నవ్వుల ఎమోజీని షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ పోస్ట్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ కూడా నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్ చేశాడు. దయచేసి ఆపండి అంటూ వ్యాఖ్యానించాడు. తాజా వీడియో పోస్ట్ భారత క్రికెట్ అభిమానుల్లో జోష్ ని పెంచింది. చాలా మంది అభిమానులు వార్నర్ ను ప్రశంసించారు.

బ్రిస్బేన్ లోని గబ్బాలో జరిగిన యాషెస్ ఓపెనర్ లో వార్నర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో అతను 94 పరుగులను ఛేదించాడు. ఇది ఆతిథ్య జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలకమైన ఇన్నింగ్స్ గా ప్రూవైంది. 35 ఏళ్ల అతను మొదటి గేమ్ లో అనేక దెబ్బలు తగిలిన తర్వాత సిరీస్ లోని రెండవ టెస్ట్ మ్యాచ్ కు దూరంగా ఉండవచ్చు. ముందు జాగ్రత్త తో అతను రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయలేదు. రెండవ మ్యాచ్ డిసెంబర్ 16 నుండి ప్రారంభం కానుంది. అడిలైడ్ ఓవల్ లో ఈ మ్యాచ్ జ‌రుగుతుంది.