Begin typing your search above and press return to search.

అమ్మాయిగా మారిన తండ్రి.. కూతురిలో ఆందోళ‌న‌!

By:  Tupaki Desk   |   29 Aug 2022 3:56 AM GMT
అమ్మాయిగా మారిన తండ్రి.. కూతురిలో ఆందోళ‌న‌!
X
విల‌క్ష‌ణ న‌టుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ న‌టించిన 'హడ్డీ' ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సంగ‌తి తెలిసిందే. పోస్టర్ లో మహిళ వేషధారణలో క‌నిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలో అత‌డు ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా రివేంజ్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కింది.

అత‌డి లింగమార్పిడి (ట్రాన్స్ జెండ‌ర్) రూపం చూశాక కుమార్తె ఎలా స్పందించింది? అంటే... దానికి న‌వాజుద్దీన్ స‌మాధానమిచ్చారు. నా కూతురు నన్ను స్త్రీ వేషంలో చూసినప్పుడు చాలా కలత చెందిందని తెలిపాడు. ఈ ప్రత్యేకమైన పాత్ర ఎంపిక గురించి నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ-''రెండు రోజులైంది. మేము హడ్డీ చిత్రీకరణను ప్రారంభించాం. ఈ చిత్రంలో నేను రెండు పాత్రలను పోషిస్తున్నాను. నేను స్త్రీగా మారిన యువ‌కుడిగా లింగమార్పిడి పాత్రను పోషిస్తున్నాను. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. అక్షత్ దగ్గర ఈ స్క్రిప్ట్ ఉంది కాబట్టి దాదాపు నాలుగేళ్లుగా సినిమా తీయాలనుకున్నారు. AK VS AK - సేక్రేడ్ గేమ్స్ లో అక్షత్ రెండవ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశారు. అతను అనురాగ్ కశ్యప్ తో కలిసి పనిచేసినప్పటి నుండి నాకు తెలుసు. ఇప్ప‌టికి చివరకు ఈ వెంచర్‌ను సాధ్యమైంది'' అని తెలిపారు.

న‌వాజ్ మాట్లాడుతూ...అవుట్ ఫిట్ - హెయిర్- మేకప్.. యే సబ్ తో థీక్ హై... అది నా ఆందోళన కాదు. అవ‌న్నీ చేయ‌డానికి నిపుణులు ఉన్నారు .. వారి పని వారికి తెలుసు. నా ఆందోళన అంతర్గత ఆలోచన ప్రక్రియను సరిగ్గా పొందడం. ఆడ‌ది ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంది..? వారికి ఏం కావాలి? అనేది గ్ర‌హించి ఒక నటుడిగా.. అతను పోషించే పాత్రను గొప్ప‌గా తెర‌పైకి తేవ‌డం ముఖ్యం. ఒక స్త్రీగా జీవితం పట్ల అవగాహన దృక్పథం భిన్నంగా ఉంటాయి. అది తెలుసుకోవ‌డం చాలా కష్టమైన ప‌ని. ఏక్ ఔరత్ కే నజారియేసే దునియా దేఖ్ని హోగీ... సినిమా అంటే కాస్ట్యూమ్స్.. హావభావాల గురించి కాదు...ఈ ప్రక్రియ అంతా మరింత అంతర్గతంగా లోతుగా ఉంటుంది.నా ప్రధాన ఆందోళన ఏమిటంటే నేను నా పాత్ర‌ను ప్రేక్షకుల ముందుకు విజ‌య‌వంతంగా తీసుకురావాలి... అని అన్నారు.

నేను చాలా మంది ప్రముఖ మహిళా దర్శకులతో పని చేసాను. అది ఇప్పుడు చాలా సహాయపడింది. మహిళలు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారని నేను గ్రహించాను. వారు చాలా దయతో ఉంటారు.. ప్రతిదానిలో అందాన్ని చూస్తారు. చాలా మంది పురుషులకు శక్తి - నియంత్రణ అవ‌స‌రం. స్త్రీ చూపు కరుణ గొప్ప‌వి. నేను ఆ చర్యను అర్థం చేసుకోవడానికి లోతుగా ప్రయత్నిస్తున్నాను. స్త్రీలు సిద్ధ‌మ‌య్యే విధానం వేరు. జుట్టు.. మేకప్.. స‌రి చేసుకుని దుస్తులు ధ‌రించ‌డానికి ప్రతిరోజూ దాదాపు మూడు గంటల సమయం తీసుకుంటారు... అని కూడా అన్నాడు.

నేను స్త్రీ పాత్రలో నటించేప్పుడు ఒక మహిళలాగే ఆలోచించాలి... నటుడిగా ఇది నాకు ఒక‌ పరీక్ష. నా కుమార్తె నన్ను స్త్రీగా చూసి చాలా కలత చెందింది. అయితే ఇది ఒక పాత్ర కోసం అని త‌నకు ఇప్పుడు తెలుసు. త‌ను దానిని అర్థం చేసుకుంది.. అని అన్నాడు.

ఇలాంటి మేక‌ప్ కోసం రోజూ సిద్ధ‌మయ్యే నటీమణులంటే తనకు చాలా గౌరవం అని కూడా అత‌డు అన్నాడు. నేను సిద్ధం కావడానికి మూడు గంటలు పడుతుంది. ఒక నటి తన వ్యానిటీ వ్యాన్ నుండి బయటకు రావడానికి పురుషుల‌ కంటే ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటుందో ఇప్పుడు నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా సమర్థించ‌ద‌గిన‌ది.. అని అన్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నవాజ్ ఈ చిత్రంతో పాటు 'టికు వెడ్స్ షేరు'.. చెహ్రా.. అద్భుత్ వంటి ఆసక్తికరమైన చిత్రాల‌లో న‌టిస్తున్నాడు.