Begin typing your search above and press return to search.

జీవిత చేతుల్లోకి కూతురి సినిమా ?

By:  Tupaki Desk   |   8 April 2019 6:19 AM GMT
జీవిత చేతుల్లోకి కూతురి సినిమా ?
X
హీరోల వారసులు తెరకు పరిచయం కావడం టాలీవుడ్ లో సర్వ సాధారణం కానీ వారసురాళ్లు రావడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందులో సక్సెస్ అయినవాళ్లను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. కమల్ కూతుళ్ళలో శృతి హాసన్ ప్రూవ్ చేసుకుంది కానీ అక్షర అంతగా ప్రభావం చూపించలేకపోయింది.మెగా డాటర్ నీహారిక ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఇప్పుడు యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ వంతు వచ్చింది.

పెద్ద కూతురు శివాత్మికతో అడవి శేష్ హీరోగా హిందీ హిట్ మూవీ 2 స్టేట్స్ కొన్ని నెలల క్రితమే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అవుట్ ఫుట్ పట్ల సంతృప్తిగా లేని హీరో నిర్మాత వల్ల ఇది ఆగిపోయిన విషయమూ అందరికి ఎరుకే. కానీ మళ్ళి మొదలుపెట్టేది లేనిది తిరిగి ఎవరితో చేస్తారు అనే క్లారిటీ మాత్రం మిస్ అవుతోంది. దీంతో డెబ్యూ చేయాలనుకున్న దర్శకుడు వెంకట్ ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది.

ఇప్పుడు తాజా అప్ డేట్ ప్రకారం రాజశేఖర్ దంపతులు దీన్ని టేకప్ చేసే ఆలోచనలో ఉన్నారట. జీవితకు దర్శకత్వ అనుభవం ఉంది. గతంలో భర్త హీరోగా శేషు - ఎవడైతే నాకేంటి- గెడ్డం గ్యాంగ్ లాంటివి టేకప్ చేసింది కాబట్టి తనకేమీ కొత్త కాదు. ఎలాగూ 2 స్టేట్స్ రీమేక్ సబ్జెక్టు. పైన చెప్పిన జీవిత డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ రీమేకులే. సో రిస్క్ తక్కువగా ఉంటుంది.

ఆ కోణంలో చర్చలు జరుగుతున్నాయట. అడవి శేష్ ప్రస్తుతం తన కొత్త సినిమాల్లో బిజీ అయిపోయాడు. ఒకవేళ 2 స్టేట్స్ మళ్ళి పట్టాలు ఎక్కితే తిరిగి రావాల్సి ఉంటుంది. తమ మొదటి కూతురి మొదటి సినిమానే ఇలా కావడం పట్ల దంపతులకు ఎంతో కొంత ఫీలింగ్ ఉంటుంది కాబట్టి రిస్క్ కు రెడీ అవుతున్నారని వినికిడి. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియొచ్చు