Begin typing your search above and press return to search.

సందీప్ కిష‌న్ పాన్ ఇండియా హంగామాకు డేట్‌ఫిక్స్‌!

By:  Tupaki Desk   |   3 Jan 2023 5:52 AM GMT
సందీప్ కిష‌న్ పాన్ ఇండియా హంగామాకు డేట్‌ఫిక్స్‌!
X
విభిన్న‌మైన సినిమాల‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్‌, అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్. గ‌త కొంత కాలంగా భారీ స్పాన్ వున్న మూవీతో హీరోగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా సందీప్ కిష‌న్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్ష‌కుల ముందుక రాబోతున్నాడు. తను న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'మైఖేల్‌'. రంజిత్‌ జ‌య‌కోడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

దివ్యాంన్ష కౌశిక్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని క‌ర‌న్ సీ ప్రొడ‌క్ష‌న్స్ ఎల్ ఎల్ పీ, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేషనన్స్ బ్యాన‌ర్ ల‌పై భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, వ‌రుణ్ సందేష్‌, అన‌సూయ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

రీసెంట్ గా విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా స‌రికొత్త నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో సందీప్ కిష‌న్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా సాగే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

రీసెంట్ గా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ సింగిల్ కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మెలోడీ ప్ర‌ధానంగా సాగిన 'నీవుంటే చాలు..' రొమాంటిక్ సాంగ్ కు సామ్ సీఎస్ అందించిన సంగీతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

భారీ స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 3న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామంటూ చిత్ర బృందం మంగ‌ళ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. రిలీజ్ డేట్ పోస్ట‌ర్ లో లీడ్ యాక్ట‌ర్స్ లుక్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ మీన‌న్‌, వ‌ర‌ల‌క్ష‌మీ శ‌ర‌త్ కుమార్‌, అన‌సూయ‌, వ‌రుణ్ సందేష్ చాలా వ‌ర‌కు ర‌గ్గ్‌డ్ క్యారెక్ట‌ర్ ల‌లో క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. సందీప్ కిష‌న్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీకి సంగీతం సామ్ సీఎస్‌, సినిమాటోగ్ర‌ఫీ కిర‌ణ్ కౌశిక్‌, మాట‌లు త్రిపుర‌నేని క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, రాజ‌న్ రాధామ‌న‌ల‌న్‌, రంజిత్ జ‌య‌కోడి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.