Begin typing your search above and press return to search.

డాషింగ్ డైరెక్టర్ 'పర్పస్ ఆఫ్ లైఫ్'.. వైరల్ వీడియో!

By:  Tupaki Desk   |   22 May 2021 9:30 AM GMT
డాషింగ్ డైరెక్టర్ పర్పస్ ఆఫ్ లైఫ్.. వైరల్ వీడియో!
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. కొద్దీకాలంగా 'పూరీ మ్యూజింగ్స్' అనే కాన్సెప్ట్ పై ఎప్పటికప్పుడు ఆయనకు తెలిసిన విషయాలు లేదా తెలుసుకున్న విషయాలు గురించి ఈ మ్యూజింగ్స్ రూపంలో (ఆడియో) ప్రేక్షకులను మోటివేట్ చేస్తున్నారు. ప్రతిసారి కొత్త టాపిక్ తో ఏదొక కొత్త విషయాన్ని జనాలకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా పూరీ 'పర్పస్‌ ఆఫ్‌ లైఫ్‌' అనే టాపిక్ పై మ్యూజింగ్స్ లో మాట్లాడారు. 'పూరి మ్యూజింగ్స్‌' ఎంత పాపులర్ అనేది యూట్యూబ్ ప్రేక్షకులకు బాగానే తెలుసు. తాజాగా మాట్లాడుతూ.. "నేనెందుకు పుట్టాను. ఎందుకు ఈ భూమ్మీద ఉన్నాను. ఏదో పర్పస్‌ ఉంది కావచ్చు అందుకే ఆ దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడు. అందులో ఆ పర్పస్‌ ఏంటి? అది తెలుసుకోవడం ఎలా? నా జీవితానికి అర్థం ఏమిటి? పరమార్థం ఏంటి? దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు" అనే అంశాలపై అని చాలామంది మదనపడుతుంటారు. నిజానికి జీవితానికి పర్పస్‌ ఉండదు.

'లైఫ్‌ ఈజ్‌ మీనింగ్‌ లెస్‌...లవ్‌ ఈజ్‌ మీనింగ్‌ లెస్‌.. ఇక్కడ జరిగే ప్రతిదీ మీనింగ్‌ లెస్‌'. ఎందులోకి తొంగి చూసినా జవాబు దొరకదు. ఎంతసేపు చూసినా ఏమీ ఉండవు. నేను కారణజన్ముణ్ని అని అనుకున్నవాడే ఇక్కడ ఎక్కువ పాపాలు చేస్తాడు. నేను ఇసుక రేణువుని అనుకున్నవాడు ఏ తప్పూ చేయకుండా సంతోషంగా జీవిస్తాడు. చెట్టుకు పర్పస్ ఏంటి? చెట్టు మీదున్న పిట్టకు పర్పస్‌ ఏంటి? అంటే వేటికీ పర్పస్‌ ఉండదు. వాటిలాగే నీవు కూడా బతికి ఉన్నావు. నీ గుండె కొట్టుకుంటోంది. అటు ఇటు తిరుగడం.. కొండెక్కడం - సముద్రంలోకి దూకడం - ఇలా ఏదనిపిస్తే అది చెయ్‌. అంతేకానీ ఓ పర్పస్‌ కోసం నేను పుట్టాను.. అని అనుకోవద్దు''. మనం ''చాలా తప్పులు చేస్తాం. మిగతా జంతువులు వేరు నేను వేరు.. అని అస్సలు అనుకోవద్దు. ఈ భూమ్మీద మానవజాతి మొత్తం అంతరించిపోయినా ఈ ప్లానెట్‌కి ఎలాంటి నష్టం లేదు.

అలాంటి ఒక యూజ్‌లెస్‌ హ్యూమన్‌ని ఏ దేవుడు ఏ పర్పస్‌ కోసం ఇక్కడికి పంపించడు. హ్యూమన్స్ ఆర్‌ యూజ్‌ లెస్‌.. అవర్ లైవ్స్ ఆర్‌ మీనింగ్‌ లెస్‌... మన గుండె ఆగేలోపు ఎన్నిసార్లు నవ్వగలిగితే అంత మంచిది. ఎందుకంటే మన శరీరంలో హార్మోన్స్ విడుదల అవుతాయి. ఆక్సిటోసిన్‌, ఎండోర్ఫిన్స్. వాటి కారణంగా ముఖంలో ఓ చిరునవ్వు వస్తోంది. మన కళ్లు కాంతివంతమవుతాయి.. మనం ఆనందంగా ఉంటాం.. మన చుట్టూ ఉన్నవాళ్లకి అందంగా కనిపిస్తాం'' ''అలా ఉండగలిగితే.. అలా బతకగలితే చాలు. దీన్ని మించి ఎక్కువగా ఆలోచించవద్దు. పర్పస్‌ ఆఫ్‌ లైఫ్‌, సోల్‌ సెర్చింగ్‌.. ఇలాంటి ఇన్విస్టిగేషన్స్ ఏమైనా చేస్తుంటే తొందరగా ఆపేయండి. నేనొక పర్పస్‌ కోసం పుట్టాననుకుంటే. నువ్వు బానిస కింద లెక్క. ఎందుకంటే నీకు ఆల్రెడీ టార్గెట్‌ ఇచ్చారు. చచ్చినట్టు ఆ పని నువ్వు పూర్తి చేయాలి. గాడిదలా మోయాలి. దానికోసం చావాలి. కాబట్టి ఏ పర్పస్‌ లేకుండా పుట్టిన జీవితాలే మంచివి. అందులోనే ఫ్రీడమ్‌ ఉంటుంది. ఫ్రీడమ్ ఈజ్‌ హైయెస్టు వ్యాల్యూ. దాన్నుంచి ఆనందం వస్తుంది. సింఫుల్‌గా చెప్పాలంటే.. యూవర్ పర్పస్‌ ఆఫ్‌ లైఫ్‌.. ఈజ్‌ యువర్ స్మైల్‌... నవ్వుతూ.. కనిపించు చాలు'' అని చెప్పుకొచ్చారు." అంటూ మంచి విషయాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.