Begin typing your search above and press return to search.

ఆస్తి తగదా: మీడియా ముందుకు దాసరి కుమారుడు

By:  Tupaki Desk   |   27 Jun 2020 12:15 PM IST
ఆస్తి తగదా: మీడియా ముందుకు దాసరి కుమారుడు
X
టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండి ఎన్నో వివాదాలు పరిష్కరించిన దాసరి నారాయణ రావు తన కుమారులు ఇద్దరికీ ఆస్తి పంపకాలు మాత్రం సరిగా చేయలేదు. ఇప్పుడదే గొడవలకు కారణమవుతోంది. సరిగా పంచకుండా ఇప్పుడు వారిద్దరినీ కొట్టుకునేలా చేస్తున్నాడు.

తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదా పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. దాసరి అరుణ్ కుమార్ పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాసరి అరుణ్ అర్ధరాత్రి తన ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి పాల్పడ్డాడని మరో కుమారుడు ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాసరి కుమారుల మధ్య జూబ్లీహిల్స్ లోని ఇల్లు విషయంలోనూ ఆస్తి వివాదం ఉంది. ఇల్లు నాదంటే నాదంటూ అరుణ్, ప్రభులు తగువులాడుకుంటున్నారు. ఈ ఇల్లు తన కూతురి పేరు మీద దాసరి నారాయణ రావు వీలునామా రాశాడని ప్రభు చెబుతున్నారు. కానీ అరుణ్ అదంతా అబద్ధమని తనదే అంటున్నారు. ఇండస్ట్రీని ఏలిన దాసరి కుమారుల మధ్య వివాదాన్ని సినీ పెద్దలు పరిష్కరించాలని పెద్ద కుమారుడు ప్రభు కోరుతున్నారు.

ఇక తన అన్న ప్రభు తనపై చేసిన ఆరోపణలపై అరుణ్ స్పందించారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు.