Begin typing your search above and press return to search.
SC/ST వేధింపుల కేసుపై దాసరి కుమారుడి స్పందన
By: Tupaki Desk | 19 Aug 2021 2:00 PM ISTప్రముఖ సినీ నిర్మాత.. దర్శకనటుడు.. దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై నర్సింహులు అనే వ్యక్తి SC/ST కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు దాసరి అరుణ్ కుమార్ పై IPC సెక్షన్ 504 మరియు 506 కింద కేసు నమోదు చేశారు.
నర్సింహులు తన ఫిర్యాదులో దాసరి అరుణ్ కుమార్ తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును డిఫాల్ట్ చేసారని తిరిగి చెల్లించమని అడిగితే కులపరమైన దూషణలను ఉపయోగించి తనను బెదిరించారని ఆరోపించారు. ఇప్పుడు అరుణ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి తన స్పందనను తెలిపారు. నర్సింహులు ఎవరో తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి దాసరితో నర్సింహులు ఎప్పుడు పని చేశాడో తనకు తెలియదని అరుణ్ అన్నారు.
నేను ఎన్నడూ కలుసుకోని వ్యక్తికి ఎందుకు చెల్లింపులు చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఈ వివాదం నుండి ఉచిత ప్రచారం మాత్రమే పొందుతాను అంటూ అరుణ్ ఛమత్కరించారు. దాసరి ఇంట పలు కుటుంబ వివాదాలపై ఇంతకుముందు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసినదే.