Begin typing your search above and press return to search.
కనిపించటం లేదు..ఈసారి దాసరి కోడలు
By: Tupaki Desk | 27 Jun 2019 5:19 AM GMTపెద్దింటి విషయాలు కొన్ని సిత్రంగా ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ కు పెద్దమనిషిలా.. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ అండగా నిలిచి.. వారి సమస్యలకు సొల్యూషన్ చెప్పిన వ్యక్తిగా దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కు పేరుంది. అలాంటి ఆయన కుటుంబానికి సంబంధించి వస్తున్న వార్తలు ఇప్పుడు షాకింగ్ గా మారుతున్నాయి. మొన్నటికి మొన్న దాసరి కుమారుడు దాసరి ప్రభు ఎవరికి చెప్పకుండా జూబ్లీహిల్స్ లోని రోడ్డునెంబరు 46లో ఉన్న తన నివాసం నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోవటం తెలిసిందే.
దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు మీద విచారణ జరపటం.. ప్రభు కోసం వెతకటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆయనే స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తనను కొంతమంది కిడ్నాప్ చేశారంటూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో ఆయన మిస్సింగ్ కేసును పోలీసులు మూసేశారు.
ఇదిలా ఉంటే.. ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చిన రోజే ఆయన సతీమణి సుశీల.. ఆమె తల్లి సావిత్రమ్మలు మాసాబ్ ట్యాంక్ లోని ఒక హోటల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి వారు కనిపించకుండా పోయినట్లుగా చెబుతున్నారు. తాజాగా తన సోదరి.. తన తల్లి కనిపించటం లేదంటూ దాసరి కోడలు సోదరి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె చిత్తూరు జిల్లా పూతల పట్టులో ఉంటారు. తాజా ఫిర్యాదు నేపథ్యంలో దాసరి కోడలు.. ఆమె తల్లి కోసం పోలీసులు వెదుకులాట షురూ చేశారు. ఒక ప్రముఖుడి ఇంటికి చెందిన కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరుగా మిస్ కావటం పోలీసులకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు.