Begin typing your search above and press return to search.
చనిపోయాడన్న వార్తలపై దాసరి కంప్లెయింట్
By: Tupaki Desk | 31 Jan 2016 12:24 PM ISTదిగ్గజ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనపై వచ్చిన వార్తలే దీనికి కారణం. కొన్ని వెబ్ సైట్లలో దాసరి మరణించాడంటూ ప్రచారం జరిగింది. గొప్ప దర్శకుడిని కోల్పోయామంటూ ప్రచారం చేసేశారు. ఈ రూమర్ బాగా సంచలనం అయి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేసేసింది.
ఆయన అభిమానులు, సన్నిహితులు ఈ వార్తలతో షాక్ తిన్నారు. ధృవపరచుకునేందుకు దాసరి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. కానీ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని, క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై దాసరి నారాయణ రావు ఆగ్రహం వచ్చింది. దీంతో జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు.
అయితే ఇది విచారణకు అర్హమైన కేసు కాకపోవచ్చంటున్నారు పోలీసులు. అందుకే ముందుగా కోర్టును సంప్రదిస్తామని.. ఒకవేళ దర్యాప్తునకు తగిన కేసు అయితే, విచారణ చేపడతామని వెస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ తెలిపారు. ఇలా అబద్ధపు వార్తలు సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నాయి. ఏకంగా చనిపోయారనే బూటకపు ప్రచారం.. వారి కుటుంబ సభ్యులకు మనోవేదన కలిగిస్తుంది. ఈ విషయాన్ని రూమర్స్ ప్రచారం చేసేవాళ్లు అర్ధం చేసుకోవాల్సి ఉంది.