Begin typing your search above and press return to search.

పెద్ద ఫ్యామిలీలపై దాస‌రి మళ్ళీ ఫైర్‌

By:  Tupaki Desk   |   31 Oct 2015 10:50 AM IST
పెద్ద ఫ్యామిలీలపై దాస‌రి మళ్ళీ ఫైర్‌
X
ప‌రిశ్ర‌మ‌లో ఆ నాలుగు ఫ్యామిలీల నుంచి ప‌దుల సంఖ్య‌లో హీరోలు పుట్టుకొస్తుంటే.. ఇక బ‌య‌టి ఫ్యామిలీల నుంచి వ‌చ్చే హీరోల‌కు దారి దొరుకుతుందా? ఇక్క‌డ వారు నిల‌బ‌డ‌గ‌లుగుతారా? ఇది చాలా క‌ష్టం.. అంటూ సూటిగా విమ‌ర్శించారు దర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు.

స్వాతి - న‌వీన్‌చంద్ర జంట‌గా న‌టించిన త్రిపుర ఆడియో వేడుక‌లో పైవిధంగా కామెంట్ చేశారు. అయితే దాస‌రి చేసిన కామెంట్ మెగా కాంపౌండ్ హీరోల‌పైనే అని అంద‌రికీ ఆ సంద‌ర్భంలో అర్థ‌మైంది. కేవ‌లం మెగా క్యాంప్ నుంచే కాదు.. ఇప్పుడున్న ప్ర‌తి ఫ్యామిలీ నుంచి డ‌జ‌న్ల కొద్దీ హీరోలు పుట్టుకొస్తున్నారు. దీనివ‌ల్ల ఇత‌ర హీరోల‌కు కాంపిటీష‌న్ పెరిగింద‌న్న‌ది వాస్త‌వంలో ఉన్న మాట‌.

ఈ ద‌స‌రాకి రిలీజైన సినిమాల్లో ఆడుతున్న‌వ‌న్నీ చిన్న సినిమాలే. ఒకే ఒక్క పెద్ద సినిమా వ‌చ్చి ఫ్లాపైంది అన్న అర్థంలోనూ ఆయ‌న కామెంట్ చేశారు. బ్రూస్ లీపై ప‌రోక్షంగా పంచ్ వేశారు. శివాజీ గ‌ణేష‌న్ లాంటి హీరోలు ప్ర‌తిభ‌తో రాణించార‌ని అన్నారు. అంతేకాదు రాజ‌మౌళి - శేఖ‌ర్‌ క‌మ్ముల‌ - క్రిష్ లాంటి డైరెక్ట‌ర్లు క‌థ‌ల్ని న‌మ్మి సినిమాలు తీస్తున్నారు. స్టార్ల‌ను న‌మ్మి కాదు. క‌థ‌తోనే స‌క్సెస్ వారి సొంతం అయ్యింది.. అని అన్నారు.

ఒక ద‌ర్శ‌కుడు వంద మంది స్టార్ల‌ను త‌యారు చేయ‌గ‌ల‌డు. కానీ ఒక్క స్టార్ ఒక్క ద‌ర్శ‌కుడిని కూడా త‌యారు చేయ‌లేడు. ఇంకో స్టార్‌ ని అయినా తీర్చిదిద్ద‌లేడు అంటూ మరో పంచ్‌ వేశారు దాస‌రి. ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌లో ఈ కామెంట్ల గురించి విస్ర్త‌తంగా చ‌ర్చ సాగుతోంది.