Begin typing your search above and press return to search.
'గ్రేట్ డైరెక్టర్ దాసరి పేరుని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు'
By: Tupaki Desk | 27 Jun 2020 4:20 PM ISTదర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుల మధ్య ఆస్తి వివాదం గత కొంతకాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దాసరి కుమారులైన అరుణ్ కుమార్ - ప్రభుల మధ్య తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ లోని ఇల్లు విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ దాసరి అరుణ్ - ప్రభు గొడవపడుతున్నారు. ఈ క్రమంలో దాసరి అరుణ్ పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తమ్ముడు అరుణ్ అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడని.. గదిలో ఉన్న బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణలపై దాసరి అరుణ్ స్పందించారు. ఇంటికి గోడ దూకి వెళ్లింది నిజమేనని.. ఇంతకు ముందు కూడా తాను ఎన్నో సార్లు గేటు దూకి ఇంట్లోకి వెళ్లానని.. కానీ దాడిమాత్రం చేయలేదని చెప్పారు. అరుణ్ కుమార్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ.. ''నేను గోడ దూకి ఇంటికి వెళ్లింది నిజమే. ఇటీవల నాకు కొరియర్ వచ్చింది. తీసుకోవడానికి వెళ్లాను. కాలింగ్ బెల్ కొడితే డోర్ తీయలేదు. అందుకే గోడ దూకాను. ఎన్నో సార్లు గేటు దూకి ఇంట్లోకి వెళ్లాను.. లోపలి వెళ్లాక ప్రభు వచ్చాడు. నా డాక్యుమెంట్ ఇస్తే వెళ్లిపోతానని చెప్పాను. కానీ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందే నా డాక్యుమెంట్ తీసుకొని వెళ్లాను. నేను వెళ్లిపోయిన తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి.. నేను మద్యం తాగి గోడదూకితే పడిపోవాలి కదా.. పోలీసుల ముందు కొడితే అప్పుడే అరెస్ట్ చేసేవాళ్లు కదా. అయినా పోలీసులు కూడా నేను అన్యాయం చేస్తేనే కదా ఆయనకి న్యాయం చేసేది'' అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ''నేను ఇంట్లో ఎవరి మీద దాడి చేయలేదు. అయినా లేడీస్ మీద ఎవరైనా చేయి చేసుకుంటారా.. తమ మధ్య ఆస్తి గొడవలు తప్ప మరేమీ లేవు. ప్రభు ఉంటున్న మా ఇల్లు ముగ్గురిది. మా అన్నకి సోదరికి నాకు దాంట్లో వాటా ఉంది. ఆయనకు నాకు మా సిస్టర్ కి ఎలాంటి వివాదాల్లేవు. ఆయన అన్ స్టేబుల్ గా డిప్రెషన్ లో ఉన్నారని అనుకుంటున్నాను. అందుకే ప్రతిసారి మీడియా పోలీసుల దగ్గరకు వెళ్తున్నారు. ఆస్తి వివాదంపై సినీ పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కరిస్తామంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఒక గంట కూర్చుంటే పరిష్కారమయ్యే చిన్న ఫ్యామిలీ గొడవని ఇలా రోడ్డు మీదకి వచ్చి గ్రేట్ డైరెక్టర్ దాసరి గారి పేరుని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే టైం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. అనవసరంగా ప్రభు ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోవడం లేదని వారిపై ఆరోపణలు చేయడం తగదు'' అని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.