Begin typing your search above and press return to search.

మలయాళి సెన్సేషనల్ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   10 Jun 2023 8:39 PM IST
మలయాళి సెన్సేషనల్ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్‌
X
హృదయం... డియర్ ఫ్రెండ్‌.. జయ జయ జయ హే చిత్రాలతో మలయాళ సినీ ప్రేమికులనే కాకుండా సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ దర్శన రాజేంద్రన్‌. ఈమె సోషల్‌ మీడియాలో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమెకు నటించే ఆఫర్లు వస్తున్నాయి.

ఈ మలయాళి ముద్దుగుమ్మ తెలుగు లో ఎంట్రీకి సిద్ధం అయ్యింది. ఇటీవలే అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌ గా సినిమా బండి ఫేమ్‌ కాండ్రేగుల ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాలో దర్శన రాజేంద్రన్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా అధికారికంగా ఈ ఫోటోతో క్లారిటీ ఇచ్చారు.

విభిన్నమైన చిత్రంగా నిలిచిన 'సినిమా బండి' తో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న కాండ్రేగుల ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ సినిమాను రూపొందించేందుకు సిద్ధం అయ్యాడు. హీరోయిన్స్ ఇద్దరు ఈ సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

అనుపమ పరమేశ్వరన్ మరియు దర్శన రాజేంద్రన్ ఇద్దరు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌. కనుక ఈ సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అవ్వడం ఖాయం. ఇక ఈ సినిమా లో మలయాళి నటుడు కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న నేపథ్యం లో ఇది ఉమెన్ సెంట్రిక్‌ మూవీ అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇతర అప్డేట్స్ ఏమీ లేవు. త్వరలోనే అన్ని వివరాలను వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి. సినిమా బండి యొక్క ఎగ్జిక్యూటివ్‌ గా వ్యవహరించిన విజయ్ డొంకాడ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.