Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: సుక్కు 'దర్శకుడు' వచ్చేశాడు

By:  Tupaki Desk   |   17 April 2017 6:47 AM GMT
ఫస్ట్ లుక్: సుక్కు దర్శకుడు వచ్చేశాడు
X
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో మూవీ రూపొందిస్తున్నాడు. రాజమండ్రి పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఇటు దర్శకుడిగానే కాదు.. మరోవైపు నిర్మాతగా కూడా సుకుమార్ తన ట్యాలెంట్ చూపిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ పై చిత్రాలను నిర్మిస్తున్నాడు సుక్కు.

నిర్మాతలు థామస్ రెడ్డి.. విజయ్ బండ్రెడ్డి లతో కలిసి 'దర్శకుడు' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు సుకుమార్. జక్కా హరిప్రసాద్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీని రూపొందిస్తుండగా.. అశోక్.. ఈషాలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి సమర్పకుడు కాగా.. ఇప్పటికే టాకీ పార్ట్ తో పాటు మూడు పాటల పిక్చరైజేషన్ కూడా పూర్తయింది. మిగిలిన పాటలను ఫారిన్ లొకేషన్స్ లో ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడీ చిత్రానికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కెమేరా ఫ్రేమ్ ను వేళ్లతో చూపిస్తున్న హీరో అశోక్ ఇందులో కనిపిస్తాడు

గతంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై రూపొందిన కుమారి 21ఎఫ్.. భారీ సక్సెస్ ను సాధించి.. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. ఇప్పుడు దర్శకుడు మూవీ పై కూడా సుకుమార్ బ్రాండ్ వాల్యూ కారణంగానే హైప్ పెరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/