Begin typing your search above and press return to search.

డార్లింగ్ మ‌రీ మొహ‌మాటం లేకుండా నో చెప్పాడా!

By:  Tupaki Desk   |   29 Nov 2020 10:40 AM IST
డార్లింగ్ మ‌రీ మొహ‌మాటం లేకుండా నో చెప్పాడా!
X
అసాధార‌ణ స్టార్ డ‌మ్.. ఇమేజ్ తో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ల‌తో టాక్ షోలు నిర్వ‌హిస్తే వాటికి టీఆర్ పీ రేంజే వేరుగా ఉంటుంది. కార్య‌క్ర‌మం పెద్ద స‌క్సెస‌వుతుంది. కోట్లాదిగా అభిమానులు ఆ వీడియోల్ని వీక్షించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు.

ప్ర‌స్తుతం సామ్ జామ్ కార్య‌క్ర‌మం డిజైన్ అంతే ప‌క‌డ్భందీగా రూపొందించార‌ట‌. ఆహా ఓటీటీని పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు బాస్ అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ ప్లాన్ ఇది. ఈ ఓటీటీ కార్య‌క్ర‌మానికి అక్కినేని కోడ‌లు స‌మంత హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో అభిమానుల్లో బోలెడంత ఇమేజ్ ఏర్ప‌డింది.

సామ్ జామ్ లో ఇప్పటికే విజయ్ దేవరకొండ- రానా దగ్గుబాటి- నాగ్ అశ్విన్- మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురిని సమంత చిట్ చాట్ కి ఆహ్వానించారు. భవిష్యత్ ఎపిసోడ్లలో ఒకదాన్ని ప్రభాస్ తోనూ చేయాల‌న్న‌ది ప్లాన్. కానీ డార్లింగ్ దీనిపై అంత‌గా ఆసక్తి చూపలేదట‌. టీమ్ కి కొంచెమ్ టచ్ లో ఉంటే చెప్తా!న‌ని అనేశార‌ట‌.

స్వ‌త‌హాగానే అంత‌ర్ముఖుడు అయిన ప్ర‌భాస్ టీవీ - డిజిట‌ల్ షోలకు ఆమ‌డ దూరంలో ఉంటారు. ఇంత‌కుముందు `ప్రదీప్ మాచిరాజు టాక్ షో`లో మాత్ర‌మే ప్ర‌భాస్ పాల్గొన్నాడు. ఆ త‌ర్వాత చాలా కాలానికి రానా దగ్గుబాటి- రాజమౌళితో క‌లిసి `కాఫీ విత్ కరణ్` షోలో ప్రభాస్ పాల్గొన్నారు.

కానీ ఇప్పుడు సామ్ జామ్ కి ఎందుక‌ని ఓకే చెప్ప‌లేదు? అన్న‌ది చ‌ర్చ‌కొచ్చింది. అయితే ప్ర‌భాస్ కి త‌క్ష‌ణం తీరిక ఉండి ఉండ‌క‌పోవ‌చ్చు. వ‌రుస షూటింగులు షెడ్యూల్స్ తో ప్యాక్ అయ్యి ఉన్నాడు. ఇప్ప‌టికిప్పుడు రెండు భారీ పాన్ ఇండియా సినిమాల్లో న‌టించాల్సి ఉండ‌గా.. రిలీజ్ కి రావాల్సిన రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్ చేయాల్సి ఉంటుంది. రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉన్న సమయానికి ప్రభాస్ సామ్ జామ్ కి అంగీక‌రించే వీలుంటుందేమో! ఎంతైనా డార్లింగ్ మ‌రీ అంత క‌ఠిన‌హృద‌యుడు కాదు క‌దా!