Begin typing your search above and press return to search.

సోలోగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న డార్లింగ్ ప్రభాస్!

By:  Tupaki Desk   |   13 March 2021 12:30 AM GMT
సోలోగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న డార్లింగ్ ప్రభాస్!
X
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రెసెంట్ ముంబైలో ఉన్న ప్రభాస్.. తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాకోసం కొన్ని కీలకమైన సోలో సీన్స్ కంప్లీట్ చేస్తున్నాడట. ముంబైలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఆదిపురుష్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించనుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ యాక్ట్రెస్ కృతిసనన్ కనిపించనుంది. ఇటీవలే కృతి ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించింది.

అలాగే సీత పాత్రతో పాటు సన్నీ సింగ్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ తో పాటు కృతి, సన్నీల కాంబినేషన్ సన్నివేశాలు కూడా షూట్ చేస్తున్నారు మేకర్స్. ఈ 3డి సినిమాను షూట్ చేసేందుకు ప్రత్యేకమైన మోషన్ క్యాప్చర్ బృందం సెట్స్‌లో ఉంది. దాదాపు 400 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ మైథలాజికల్ మూవీలో సైఫ్ అలీఖాన్ రావన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదివరకు చెప్పినట్లుగా ఆదిపురుష్ ఇండియన్ సినిమాల్లో మొట్టమొదటిసారిగా కొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది. రియల్ టైమ్ టెక్నాలజీ వీఎఫ్‌ఎక్స్ ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. మరోవారంలో ప్రభాస్ సలార్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఆ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.