Begin typing your search above and press return to search.

'ఆర్మీ ఆఫీసర్'గా డార్లింగ్ ప్రభాస్.. ఎందులో అంటే??

By:  Tupaki Desk   |   18 May 2021 1:01 PM IST
ఆర్మీ ఆఫీసర్గా డార్లింగ్ ప్రభాస్.. ఎందులో అంటే??
X
పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ అనే ప్రేమకథాచిత్రం పూర్తిచేసి సలార్ అనే మాస్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ మూవీ తెరకెక్కుతుంది. కేజీఎఫ్ మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ రూపుదిద్ధుకుంటుంది. నిజానికి ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలిసినప్పటి నుండే సినిమా పై అంచనాలు భారీ లెవెల్లో సెట్ అయ్యాయి. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్కులో కనిపించనున్నట్లు సలార్ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. డార్లింగ్ - శృతి ఫస్ట్ టైం కాంబినేషన్ సెట్ అవ్వడంతో వీరి కెమిస్ట్రీ అదిరిపోతుందని టాక్. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ పై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలో శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. ఇంతలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడో అని పలు పుకార్లు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

ఇలాంటి సాలిడ్ మూవీలో డ్యూయెల్ రోల్ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. మరి ఎలాంటి క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడని అంటే.. ఈ సినిమాలో కూడా ఓ గతం ఉంటుందని అందులో ఓ రకంగా.. ప్రెసెంట్ ఓ రకమైన క్యారెక్టర్ లో ప్రభాస్ అలరించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో కథనాల ప్రకారం.. ప్రభాస్ డ్యూయెల్ రోల్స్ లో ఓ క్యారెక్టర్ లో ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమాను ఓంరౌత్ తెరకెక్కిస్తున్నాడు.