Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్‌: నైసుగా ఝ‌డిపిస్తున్న సిండ్రెల్లా

By:  Tupaki Desk   |   8 Sep 2021 3:15 PM GMT
ట్రైల‌ర్ టాక్‌: నైసుగా ఝ‌డిపిస్తున్న సిండ్రెల్లా
X
రాయ్ లక్ష్మి బహుభాషా నటిగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తమిళం- తెలుగు -మలయాళం-హిందీలో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ సంవత్సరం మూడు సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో సిండ్రెల్లా - గ్యాంగ్‌స్టర్ 21.. తెలుగులో ఆనంద భైరవి చిత్రాల్లో న‌టిస్తోంది. హర్రర్ మూవీ `సిండ్రెల్లా` షూటింగ్ పూర్తి చేసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

సిండ్రెల్లా అనేది ఒక నాయికా ప్ర‌ధాన ఫాంటసీ హారర్-థ్రిల్లర్ చిత్రం. SSI ప్రొడక్షన్స్ బ్యానర్ పై SJ సూర్య మాజీ అసిస్టెంట్ వినూ వెంక‌టేశ్ దర్శకత్వం వహించారు. రాఘవ లారెన్స్ కాంచన సుందర్ సి అరణ్మనై వంటి బ్లాక్ బస్టర్ హర్రర్ చిత్రాల్లో న‌టించిన రాయ్ ల‌క్ష్మి సిండ్రెల్లాలో విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు ధనుష్ ఈరోజు సిండ్రెల్లా ట్రైలర్ ను లాంచ్ చేశారు. సినిమా ట్రైలర్‌ని విడుదల చేసినందుకు ధ‌నుష్ కి రాయ్ లక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు.

సిండ్రెల్లా టైటిల్ కి త‌గ్గ‌ట్టే ట్రైల‌ర్ ఆద్యంతం మైమ‌రిపించింది. ముఖ్యంగా ఇందులో హార‌ర్ ఎలిమెంట్స్ లో వ‌చ్చే నేప‌థ్య సంగీతం క్ష‌ణ‌కాలం ఝ‌లక్ మ‌నిపిస్తోంది. ట్రైలర్ వెన్ను ఒణికించే మ్యూజిక్ స్కోర్ తో ఆకట్టుకుంది. రాయ్ లక్ష్మి ప్రోమోలో రెండు లుక్స్ తో క‌నిపించింది. నిజానికి నెల‌రోజుల క్రితం రిలీజైన అమెజాన్ సిరీస్ సిండ్రెల్లా తో ఈ సిండ్రెల్లాకు పోలిక క‌నిపిస్తోంది. రాయ్ ల‌క్ష్మీ అంద‌మైన ప‌ల్లె యువ‌తిగా క‌నిపిస్తూనే సిండ్రెల్లా దుస్తుల్లో అల‌రిస్తోంది. ట్రైల‌ర్ ఆద్యంతం స‌స్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకున్నాయి. త్వ‌ర‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. రాయ్ లక్ష్మీ .. బిగ్ బాస్ తమిళ్ 3 ఫేమ్ సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. రోబో శంకర్- కల్లూరి వినోద్- అన్బు థసన్- మై డియర్ బూతం అభిలాష్ - బాయ్స్ రాజన్ సహాయక పాత్రల్లో నటించారు.