Begin typing your search above and press return to search.

తెలుగు 'దర్బార్‌' మూడు రోజుల ముచ్చటేనా?

By:  Tupaki Desk   |   6 Jan 2020 10:28 AM GMT
తెలుగు దర్బార్‌ మూడు రోజుల ముచ్చటేనా?
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌.. మురుగదాస్‌ ల కాంబోలో తెరకెక్కిన 'దర్బార్‌' చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తమిళనాట ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలకు నిర్మాతలు ప్లాన్‌ చేశారు. కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం విడుదల కోసం బయ్యర్లు మరియు నిర్మాతలు కష్టపడాల్సి వస్తుంది. 11వ తారీకున సరిలేరు నీకెవ్వరు మరియు 12వ తారీకున అల వైకుంఠపురంలో సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల ను ఆక్యుపై చేయబోతున్నాయి.

సరిలేరు నీకెవ్వరు కోసం దిల్‌ రాజు భారీ ఎత్తున థియేటర్ల అట్టి పెట్టుకున్నాడు. ఇక అల వైకుంఠపురంలో సినిమా కోసం అల్లు అరవింద్‌ కావాల్సినన్ని థియేటర్లను హోల్డ్‌ లో పెట్టాడట. ఈ రెండు సినిమాలే కాకుండా నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయనకు కూడా నిర్మాతలు కొన్ని థియేటర్లు బుక్‌ చేశారు. ఒకేసారి నాలుగు సినిమాలు ఆడాలి అంటే మామూలు విషయం కాదు. అన్ని సినిమాలకు అత్యధిక థియేటర్లు అంటే సాధ్యం అయ్యే విషయమే కాదు.

పరిస్థితి చూస్తుంటే ముందు విడుదల కాబోతున్న దర్బార్‌ చిత్రం మొదటి రెండు మూడు రోజులు మాత్రమే ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించబడి ఈ మూడు సినిమాలు వచ్చిన తర్వాత డబుల్‌ డిజిట్‌ థియేటర్ల సంఖ్యకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమా కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా ఇతర ఫలితం ఏది వచ్చినా కూడా దర్బార్‌ కు మాత్రం థియేటర్ల సమస్య ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ప్రముఖ నిర్మాత భారీ మొత్తంను పెట్టి కొనుగోలు చేశాడు. ఆ మొత్తం రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే కనీసం వారం రోజులు భారీ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. థియేటర్లు లేకుండా వారం రోజులు కలెక్షన్స్‌ ఎలా రాబట్టగలదని కొందరు అప్పుడే ఆందోళన చెందుతూనే ఉన్నారు. మరి సూపర్‌ స్టార్‌ రజినీ ఈ పరిస్థితి నుండి ఎలా బయట పడతాడో చూడాలి.