Begin typing your search above and press return to search.

మెర్రి క్రిస్మ‌స్: స‌ంక్రాంతి పందెం లో ర‌జ‌నీ కి స‌వాల్!

By:  Tupaki Desk   |   25 Dec 2019 4:22 AM GMT
మెర్రి క్రిస్మ‌స్: స‌ంక్రాంతి పందెం లో ర‌జ‌నీ కి స‌వాల్!
X
గ‌త సంక్రాంతి కి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన పేట (పెట్టా-త‌మిళ్) రిలీజైంది. త‌మిళ‌నాడులో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగు నాట మాత్రం ఆడియెన్ య‌థావిధి గా పెద‌వి విరిచేశారు. ర‌జ‌నీకి ఎందుక‌నో కథానాయ‌కుడు (కుచేల‌న్) టైమ్ నుంచి బ్యాడ్ టైమ్ ర‌న్ అవుతోందిక్క‌డ‌. యానిమేష‌న్ బొమ్మ‌ల సినిమా కొచ్చాడ‌యాన్ ఏకంగా ఆ చిత్రానికి పెట్టుబ‌డులు పెట్టిన ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి ఫిలింస్ అధినేత‌ ను పూర్తి క్రైసిస్ లో దించేయ‌డం.. పంపిణీ వ‌ర్గాల్ని దెబ్బ కొట్ట‌డం పెద్ద బ్యాడ్ అయ్యింది. ఆ త‌ర్వాత ర‌జ‌నీ ఎంత ట్రై చేసినా పైకి లేవ‌ లేక‌పోయారు.

ఆ ప్ర‌భావం `పేట` సినిమా పైనా ప‌డింది. కంటెంట్ యావ‌రేజ్ గా ఉన్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎందుక‌నో నెగెటివ్ ఫ‌లిత‌మే ఎదురైంది. అందుకే ఇప్పుడు ర‌జ‌నీకాంత్ న‌టించిన `ద‌ర్బార్` సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా రిలీజ‌వుతున్నా.. తెలుగులో ఆశించినంత బజ్ లేకుండా పోయింద‌ని విశ్లేషిస్తున్నారు. ఏ.ఆర్.మురుగ‌దాస్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌భావం లేకుండా పోయింది ఎందుక‌నో. ఇక మురుగ‌దాస్ చివ‌రిగా తెర‌కెక్కించిన స్పైడ‌ర్ ఫ‌లితం ప్ర‌భావం ట్రేడ్ లో అంతే ఇబ్బందిక‌రంగా మారింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

ఇక‌ ర‌జ‌నీ సినిమాల‌ కు టాలీవుడ్ ప్ర‌చారం ఎప్పుడూ నాశిర‌కంగానే ఉంటుంద‌న్న ఆవేద‌న అభిమానుల్లో అలానే ఉంది. కార‌ణం ఏదైనా ద‌ర్బార్ కి ప్రీబ‌జ్ పెంచేందుకు ప్ర‌య‌త్నించే ఆలోచ‌నే చేయ‌క‌ పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. అప్పుడ‌ప్పుడు పండ‌గ‌లు ప‌బ్బాల‌కు ట్వీట్లు చేస్తే అదే ప్ర‌చారం అని న‌మ్మాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇక పోతే సంక్రాంతి బ‌రి లో అంద‌రికంటే ముందుగా వ‌చ్చేది త‌లైవానే. ర‌జ‌నీ న‌టించిన ద‌ర్బార్ జ‌న‌వ‌రి 8 లేదా 9న రిలీజ్ కానుంది. అయితే ప్ర‌చారంలోనే ఈ సినిమా వెన‌క‌ బ‌డింది. ఓవైపు అల వైకుంఠ‌పుర‌ములో .. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి స్ట్రెయిట్ చిత్రాల్ని మూల‌ మూల‌ల‌కు బాగా ఎక్కించేందుకు చేయాల్సిన ప్ర‌చారం చేస్తుంటే.. ద‌ర్బార్ యూనిట్ మాత్రం ఎందుక‌నో సైలెంట్ గానే ఉంది. ఇక ద‌ర్బార్ కి సంబంధించిన ప్ర‌తి విజువ‌ల్ కాపీ రైట్ స‌మ‌స్య లేదు! ఎవ‌రైనా ఉప‌యోగించుకోండి. మా సినిమాని తెలుగు ప‌ల్లెల్లోనా మూల మూల‌ల‌కు విసిరేయండి! అంటూ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేయ‌డం హాస్యాస్ప‌దం అయ్యింది. ప్రాప‌ర్ మీడియా ద్వారా ప్ర‌మోష‌న్ చేయ‌క‌పోతే ఎంత చేసినా ఈరోజుల్లో ఆశించినంత మైలేజ్ రావ‌డం లేదు. మ‌రి ఈ క్రైసిస్ నుంచి ప‌ది రోజుల ముందే బ‌య‌ట‌ప‌డేందుకు ద‌ర్బార్ టీమ్ ఏం చేయ‌బోతోంది? అస‌లు ద‌ర్బార్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇదీ అని చెప్పేందుకు ఏం చేయ‌బోతున్నారు? అన్న‌ది చూడాలి. నేడు క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ర‌జ‌నీకి అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఫ్యాన్స్- ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.. రాజ‌కీయ వ‌ర్గాల నుంచి విషెస్ వెల్లువెత్తాయి. అంద‌రికీ ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.