Begin typing your search above and press return to search.

#బాండ్ 007 `నోటైమ్ టు డై`తో క్రెయిగ్ రిటైర్మెంట్..!

By:  Tupaki Desk   |   29 Sep 2021 9:08 AM GMT
#బాండ్ 007 `నోటైమ్ టు డై`తో క్రెయిగ్ రిటైర్మెంట్..!
X
జేమ్స్ బాండ్ ప్రాంచైజీ అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు `డేనియ‌ల్ క్రెయింగ్`. బాండ్ సిరీస్ లో ఎంత‌మంది న‌టించినా డేనియ‌ల్ అంటే స్పెషాల్టీ వేరే. ఎక్కువ కాలం బాండ్ గా చెలామ‌ణి అయింది కూడా ఈ బ్రిట‌న్ న‌టుడే. వాస్త‌వానికి జేమ్స్ బాండ్ గా డేనియ‌ల్ పేరు తెర‌పైకి రాగానే ఘోర‌మైన విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు హాలీవుడ్ క్రిటిక్స్. మిగ‌తా వారితో పోల్చితే త‌క్కువ ఎత్తు ఉండ‌టం.. బాండ్ గా అస‌లు ఆ పాత్ర‌కు సెట్ అవుతాడా? అని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే అన్నింటికి డేనియ‌ల్ చెంప దెబ్బ లాంటి స‌మాధానం ఇచ్చాడు. జేమ్స్ బాండ్ అంటే డేనియ‌ల్ ఒక్క‌డేన‌ని ప్ర‌పంచానికి చాటి చెప్పేంత‌గా ఫేమ‌స్ అయ్యారు.

బాండ్ ప్రాంచైజీ నుంచి వ‌చ్చిన తొలి చిత్రం `కాసినో రాయ‌ల్` విజ‌యంతో అంద‌రి నోళ్లు మూయించారు. ఆ త‌ర్వాత దాదాపు 15 ఏళ్ల పాటు బాండ్ గా కొన‌సాగారు. `క్వాంట‌మ్ ఆఫ్ సోల‌స్`..`స్కైపాల్`..`స్పెక్ట‌ర్` బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌స‌ళ్ల వ‌ర్షం కురిపించాయి. అయితే తాజాగా డేనియ‌ల్ ఈ సిరీస్ నుంచి ఇక త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చివ‌రిగా `నో టైమ్ టూ డై` చిత్రంతో బాండ్ ప్రాంచైజీకి గుడ్ చై చెప్పేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ చిత్రం అన్ని ప‌నులు పూర్తిచేసుకుని సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాండ్ ప్రాంజైజీ నుంచి రాబోతున్న‌25వ సినిమా ఇది.

భార‌త్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. డేనియ‌ల్ క్రెయిగ్ ఎగ్జిట్ నేప‌థ్యంలో త‌దుప‌రి బాండ్ ఎవ‌రు? అన్న దానిపై అప్పుడే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. నాన్ బ్రిట‌న్ ఆర్టిస్ట్.. బ్లాక్ ఆర్టిస్ట్..లేదంటే లేడీ బాండ్ ని రంగంలోకి దించాలా? అని నిర్మాణ సంస్థ `ఈయోన్ ప్రొడ‌క్ష‌న్స్` భావిస్తోందిట‌. దీనిపై క్లారిటీ దొర‌క‌డానికి ఇంకొంచెం స‌మ‌యం ప‌డుతుంది. తొలుత బాండ్ కి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది స్కాటిష్ న‌టుడు సీన్ కాన‌రీ అన్న సంగ‌తి తెలిసిందే.

వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ ఐమాక్స్ లో క్రెయిగ్ చివ‌రి సినిమా

ప్రపంచంలోని అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లాంచింగ్ కి సిద్ధంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ లో రెండే రెండు ఐమ్యాక్స్ ల గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చ సాగింది. ఇందులో హైదరాబాద్ ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద ఐమ్యాక్స్ గా పాపుల‌రైంది. ఇప్పుడు వీట‌న్నిటి కంటే అతి పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ ని జర్మనీలో తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. జర్మనీలోని లియోన్ బర్గ్ లోని ట్రామాప్లాస్ట్ మల్టీప్లెక్స్‌లో ఈ స్క్రీన్ ఉంది. 70 అడుగుల ఎత్తు .. 125 అడుగుల వెడల్పుతో సెట్ చేయబడిన అతి భారీ స్క్రీన్ ఇద‌ని చ‌ర్చ సాగుతోంది.

జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ `నో టైమ్ టు డై` రిలీజ్ తో జ‌ర్మ‌నీ ఐమ్యాక్స్ ని లాంచ్ చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. బాండ్ 007 ప్రదర్శనతో ట్రామాప్లాస్ట్ IMAX ప్రారంభోత్స‌వానికి సిద్ధంగా ఉంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రెయిగ్ న‌టిస్తున్నారు. ఇదే అత‌డికి ఫ్రాంఛైజీలో చివ‌రి అవ‌కాశం అని తెలిసింది.

బాండ్ సిరీస్ లో 25వ చిత్రం `నో టైమ్ టు డై` ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెరుచుకునే ప‌రిస్థితి లేనందును ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లేదా ఆపిల్ స్ట్రీమింగ్ కి విక్ర‌యించ‌నున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ మేర‌కు చిత్ర‌బృందంపై తీవ్ర ఒత్తిడి నెల‌కొంద‌ని ప్ర‌ముఖ హాలీవుడ్ వెబ్ సైట్లు క‌థ‌నాల్ని వెలువ‌రించాయి. రాబోయే జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్ కు వెళ్ళవచ్చు అన్న ఊహాగానాలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. బాండ్ సిరీస్‌లోని 25 వ చిత్రం .. అలాగే డేనియల్ క్రెయిగ్ న‌టిస్తున్న 007 సిరీస్‌ చివరి చిత్రం `నో టైమ్ టు డై` 2020 బెస్ట్ క్రేజీ చిత్రంగా చ‌ర్చ‌ల్లో ఉంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన ముందు వ‌రుస చిత్ర‌మిద‌న్న చ‌ర్చా సాగుతోంది. 2020 నవంబర్ లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 2021 వరకు వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాతా సెప్టెంబ‌ర్ రిలీజ్ అన్నారు .. కానీ కుద‌ర‌లేదు. అక్టోబ‌ర్ 8న ఎట్ట‌కేల‌కు అమెరికాలో ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది. అలాగే ఫేస్ బుక్ లో ప్రీమియ‌ర్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

థియేటర్లను వ‌దిలేసి నో టైమ్ టు డైని అత్యధిక బిడ్డర్ ‌కు విక్రయించడానికి MGM ఒత్తిడిలో ఉందని క‌థ‌నాలొచ్చాయి. ప‌లు స్ట్రీమింగ్ ప్లాట్ ‌ఫాంలు ఈ చిత్రాన్ని చాలా పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నో టైమ్ టు డై నిర్మాణానికి బడ్జెట్ $ 250 మిలియన్లు ఖ‌ర్చయ్యింది. కాబట్టి థియేట్రికల్ విడుదలను అధిగ‌మించాలంటే.. స్ట్రీమింగ్ బిడ్లు అనూహ్యంగా భారీ మొత్తంలో ఉండాల‌ని అంచ‌నా వేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హమ్మారి కారణంగా థియేటర్లు తెర‌వ‌డం ఆలస్యం అయిన తరువాత ఆపిల్ టీవీ + ఈ సంవత్సరం ప్రారంభంలో టామ్ హాంక్స్ `గ్రేహౌండ్స్` ని కొనుగోలు చేసినప్పుడు బాండ్ సినిమాని కొనుగోలు చేయాల‌ని భావించింది. కానీ ఆ వివ‌రాలు పూర్తిగా వెల్ల‌డి కాలేదు. బాండ్ సిరీస్ చివ‌రి సినిమా నో టైమ్ టు డై ని అమెరికా- బ్రిట‌న్ ల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.