Begin typing your search above and press return to search.

భీమ్లా నాయక్ కు ధీటుగా నిలబడే డేనియల్ శేఖర్..!

By:  Tupaki Desk   |   14 Dec 2021 12:00 PM GMT
భీమ్లా నాయక్ కు ధీటుగా నిలబడే డేనియల్ శేఖర్..!
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే ''భీమ్లా నాయక్'' చిత్రం నుంచి విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్స్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు రానా పుట్టినరోజు సందర్భంగా సినీ అభిమానులకు మరో సర్ప్రైజ్ అందించారు. రానా పోషిస్తున్న డేనియల్ శేఖర్ పాత్రకు సంబంధించిన పవర్ ఫుల్ వీడియోను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు.

''వాడు అరిస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు? దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ సస్పెండెడ్.." అంటూ రానా ఆవేశంగా పవన్ కళ్యాణ్ పాత్రను ఉద్దేశిస్తూ ఎవరితోనో మాట్లాడుతుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. మధ్యలో పోలీసాఫీసర్ గా పవన్ కనిపించడంతో వీరిద్దరి మధ్య సన్నివేశాలపై ఉత్సుకత రేకెత్తుతోంది.

కాగా, మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌ గా ''భీమ్లానాయక్‌'' తెరకెక్కుతోంది. ఇద్దరు సమజ్జీవుల మధ్య అహం - ఆత్మాభిమానం వల్ల వారి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

'భీమ్లా నాయక్' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాలో రావు రమేష్ - మురళీశర్మ - సముద్ర ఖని - రఘుబాబు - నర్రా శ్రీను - కాదంబరి కిరణ్ - చిట్టి - పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.