Begin typing your search above and press return to search.
పిక్ టాక్: డేంజరస్ మ్యాన్ తో డేంజరస్ గర్ల్స్..!
By: Tupaki Desk | 14 May 2021 5:00 PM ISTవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ''డేంజరస్''. ఆర్జీవీ బ్యూటీస్ నైనా గంగూలీ - అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరు మహిళల మధ్య ఉద్వేగభరితమైన హై ఇంటెన్సిటీ లెస్బియన్ లవ్ స్టోరీ ఇదని వర్మ ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిల లిప్ లాక్ పోస్టర్స్ ని వదిలి సంచలనం రేపిన ఆర్జీవీ.. లేటెస్టుగా 'డేంజరస్' ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి వరుస ట్వీట్స్ చేస్తున్న వర్మ.. డేంజరస్ గర్ల్స్ తో ఉన్న ఓ పిక్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేశారు.
ఇందులో రామ్ గోపాల్ వర్మ తన మొబైల్ తో సీన్ ని వివరిస్తుండగా.. నైనా గంగూలీ - అప్సర రాణి ఇద్దరూ తీక్షణంగా చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. ''నేను డేంజరస్ అమ్మాయిలు నైనా గంగూలీ మరియు అప్సర రాణికి ఒక ప్రేమ సన్నివేశాన్ని వివరిస్తున్నాను'' అని పేర్కొన్నారు. దీనికి డేంజరస్ మ్యాన్ వర్మతో డేంజరస్ గర్ల్స్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే 'డేంజరస్' చిత్రంలో నైనా - అప్సర మీద ఒక సాంగ్ తీశానని.. ఇది వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇద్దరు మహిళల మధ్య చిత్రీకరించిన మొట్టమొదటి రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ అని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు. లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ అంటూ ఆర్జీవీ చేస్తున్న ఈ డేంజరస్ ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. డిజిటల్ వరల్డ్ లోకి సరికొత్తగా అడుగుపెడుతున్న 'స్పార్క్' ఓటీటీలో 'డేంజరస్' సినిమా అతి త్వరలో విడుదల కానుంది.