Begin typing your search above and press return to search.

వృత్తిపరంగా ఆ హీరోని ద్వేషిస్తున్నాడట!

By:  Tupaki Desk   |   23 Dec 2016 11:30 AM GMT
వృత్తిపరంగా ఆ హీరోని ద్వేషిస్తున్నాడట!
X
ఇండస్ట్రీతో సంబందం లేకుండా... ఏ ఇద్దరి స్టార్ హీరోల మధ్య అయినా సమస్యలు ఉండవు.. ఫైనల్ గా వారంతా ఒకటే.. వారి పేరు చెప్పుకుని అభిమానులనబడేవారు మాత్రం వో హడావిడి చేసేస్తుంటారు.. మా హీరో గొప్ప అంటే మా వాడు గొప్ప అని చెలరేగిపోతుంటారు. కానీ... ఆయా అభిమానుల నటులు మాత్రం చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. ఇదే విషయాన్ని వారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కూడా... మేమంతా ఒకటే - మాకోసం మీరు అనవసర పంచాయితీలు తేవొద్దు అని. ఈ ఉపోద్గాతమంతా ఎందుకంటే... సినిమాల విషయాల్లో పోటీలు ఉంటాయే తప్ప వ్యక్తులుగా - సాటి నటులుగా సల్మాన్ - అమీర్ ఖాన్ లు ఎంత స్నేహంగా ఉంటారనే దానికి తాజా ఉదాహరణ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది!!

"మా కుటుంబమంతా ఈ రోజు దంగల్ సినిమా చూసింది.. ఇది సుల్తాన్ సినిమా కంటే బాగుంది. అమీర్ ఖాన్ నిన్ను వ్యక్తిగా వ్యక్తిగతంగా ప్రేమిస్తాను కానీ.. వృత్తిపరంగా ద్వేషిస్తున్నాను" అంటూ సల్మాన్ ఖాన్ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే దంగల్ కి ప్రీ రిలీజ్ రివ్యూలన్నీ సూపర్ పాజిటివ్ గా వస్తున్న సమయంలో సల్మాన్ తాజా ట్వీట్ మరింతగా సినిమాకి బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే రెజ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సుల్తాన్ - రాబోతున్న దంగల్ మధ్య ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో... సల్మానే స్వయంగా సుల్తాన్ కంటే బాగుందని చెప్పడం పాజిటివ్ సంకేతమే కాకుండా, వారిమధ్య ఉన్న స్నేహానికి కూడా సంకేతనమే చెప్పాలి.

కాగా సల్మాన్ సుల్తాన్ సినిమా విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకెళ్లి సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ సుల్తాన్‌ అలీఖాన్‌ కెరీర్ ఇతివృతంగా తెరకెక్కిన ఈ సినిమా కథ మాత్రం పూర్తిగా కల్పితం. కానీ ఇప్పుడు అమీర్ మాత్రం నిజ జీవిత కథ ఆధారంగా దంగల్ తో ప్రేమక్షుల ముందుకు వచ్చాడు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/