Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాకు బై చెప్పిన దంగల్ బ్యూటీ!
By: Tupaki Desk | 27 April 2021 3:02 PM ISTదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కరోనా వ్యాధి గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటివరకు బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ కూడా కరోనా గురించి ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్టులు పెట్టింది. అయితే తాజాగా ఈ దంగల్ బ్యూటీ కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. అయితే ఎందుకు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని అనుకుంటుందో కారణం మాత్రం చెప్పలేదు ఫాతిమా. తాను సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంటున్నానని.. ఫ్యాన్స్, ఫాలోయర్స్ సురక్షితంగా ఉండాలని కోరింది.
ప్రస్తుతం ఫాతిమా ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. కానీ కారణం మాత్రం కరోనానే అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫాతిమా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ప్రకటించడం ఇదేం కొత్తకాదు. ఇదివరకు 2019లో కూడా ఫాతిమా పర్సనల్ రీసన్స్ వలన సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంది. ఇంతకుముందు ఫాతిమా సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయిపోయింది. ఆ కారణంగానే అప్పుడు బ్రేక్ తీసుకుంది. బదులుగా బుక్స్ చదువుతూ కొంతకాలం గడిపేసింది. ఇంస్టాగ్రామ్ లో అమ్మడికి 2.5 మిలియన్స్ పైగా ఫాలోయింగ్ కలిగి ఉంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోస్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఫాతిమా.. దంగల్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఇటీవలే లేటెస్ట్ మూవీ అజిబ్ దస్తాన్ ప్రమోషన్స్ టైంలో కరోనా బారినపడి కోలుకుంది. ప్రస్తుతం బ్రేక్ తీసుకోనున్నట్లు ప్రకటించింది.