Begin typing your search above and press return to search.

'సూపర్ స్టార్' అయిపోయిన ఆమిర్ కూతురు

By:  Tupaki Desk   |   16 Dec 2016 10:30 PM GMT
సూపర్ స్టార్ అయిపోయిన ఆమిర్ కూతురు
X
ఆమిర్ ఖాన్ కొత్త సినిమా దంగల్ మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇందులో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కి నలుగురు కూతుళ్లు ఉండగా.. అందులో ఇద్దరిని రెజ్లర్ ని తీర్చిదిద్దుతాడు. వీరిలో గీతా ఫొగట్ చిన్నప్పటి పాత్రను పోషించిన అమ్మాయి పేరు జైరా వాసిం. ఇప్పుడా అమ్మాయి సూపర్ స్టార్ అయిపోతోంది. దంగల్ రిలీజ్ కాకముందే.. ఆమిర్ కూతురు సూపర్ స్టార్ ఎలా అవుతుందనే డౌట్ సహజమే కానీ.. ఆమె సీక్రెట్ సూపర్ స్టార్ అవుతోంది. అది కూడా అదే పేరుతో రూపొందుతున్న సినిమాలో.

సీక్రెట్ సూపర్ స్టార్ లో.. పెద్ద సింగర్ అయిపోవాలని అనుకున్న ఓ టీనేజ్ అమ్మాయి పాత్రను జైరా వాసిం పోషించగా.. ఇప్పుడా మూవీ టీజర్ రిలీజ్ అయింది. ప్రపంచానికి తన గొంతు వినిపించాలనే కల తీరకపోవడంతో.. తన పేరు చెప్పకుండానే 'సీక్రెట్ సూపర్ స్టార్' అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాని ద్వారా సూపర్ స్టార్ అయిపోవడం అనేది ఈ మూవీ థీమ్. జైరా వాసిం యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. అయితే.. టీజర్ చివర్లో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ వచ్చి అసలైన ఫినిషింగ్ ఇస్తాడు.

డిఫరెంట్ గెటప్ తో హిప్పీ టైపులో రెడీ అయిపోయిన ఆమిర్ ఖాన్.. 'సూపర్.. సూపర్ హిట్.. నచ్చిందా.. నచ్చితే లైక్ చేయండి.. నచ్చకపోతే మీ టేస్ట్ మార్చుకోండి' అంటూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ లవ్యూ చెప్పి టీజర్ ని ఫినిష్ చేశాడు ఆమిర్ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/