Begin typing your search above and press return to search.

డ్యాన్సింగ్ అంకుల్.. కొత్త పాలిసీ

By:  Tupaki Desk   |   9 Jun 2018 8:39 AM GMT
డ్యాన్సింగ్ అంకుల్.. కొత్త పాలిసీ
X
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అన్నట్లే.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఎలాంటి న్యూస్ వైరల్ అవుతుందో ఎవ్వరికి తెలియదు. కాస్త కొత్తగా అనిపించినా కూడా గూగుల్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి చేసిన డ్యాన్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. డాన్సింగ్ అంకుల్ అని అతనికి ఓ పేరు కూడా వచ్చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే అతనికి సంబందించిన నాలుగు వీడియోలు హల్చల్ చేయగా మరొక కొత్త వీడియో వైరల్ అయ్యింది.

ప్రొఫెసర్ శ్రీవాత్సవ ఒక పెళ్లిలో చేసిన గోవిందా స్టెప్పులు అందరికి బాగా నచ్చాయి. యూత్ లో అయితే అతనికి క్రేజ్ బాగానే వచ్చింది. ఇక ఈ క్రేజ్ ను ఒక కంపెనీ బాగా వాడుకుంటోంది. బజాజ్ అళియన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసి కి సంబందించిన ఒక వీడియో ను పోస్ట్ చేశారు. అందులో శ్రీవాత్సవ తన సరికొత్త స్టెప్పులతో యాడ్ కు తగ్గటుగా స్టెప్పులు వేశాడు. ఈ డ్యాన్స్ కి కూడా నెటిజన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కంపెనీ ఛీఫ్ మార్కెటర్ చంద్రమోహన్ ఈ యాడ్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం శ్రీవాత్సవ డ్యాన్స్ కు మంచి క్రేజ్ ఏర్పడిందని జీవితంలో ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని ఈ వీడియో ద్వారా తమ బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక అంకుల్ డ్యాన్స్ చూసి సినిమా ప్రముఖులు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఇమిటేట్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీవాత్సవ కుటుంబాన్ని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ గా కలుసుకున్నాడు.