Begin typing your search above and press return to search.
RRR నిర్మాత వారసుడు ఫ్లాప్ డైరెక్టర్ తోనా?
By: Tupaki Desk | 31 Jan 2020 10:05 AM ISTRRR నిర్మాత డీవీవీ దానయ్య వారసుడు డీవీవీ కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏడాది కాలంగా తామరతంపరగా ప్రచారం వేడెక్కిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లను పరిశీలించి చివరికి ఓ డైరెక్టర్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇంతకీ స్టార్ ప్రొడ్యూసర్ వారసుడిని పరిచయం చేసేది ఎవరు? .. అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ప్రేమకథా చిత్రాల్ని లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగా తెరకెక్కించే మారుతి దర్శకత్వంలో కళ్యాణ్ డెబ్యూ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారమైంది. అందుకోసం దానయ్య అడ్వాన్సులు కూడా ఇచ్చారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. కానీ ఏమైందో ఇంతలోనే దర్శకుడు మారారన్న ప్రచారం సాగుతోంది.
మారుతి స్థానంలో సాక్ష్యం ఫేం శ్రీవాస్ డీవీవీ వారసుడిని పరిచయం చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. శ్రీవాస్ ఇంతకుముందు ఒకట్రెండ్ హిట్ చిత్రాల్ని తెరకెక్కించినా ఇటీవల ఫ్లాపులు ఎదురయ్యాయి. గోపిచంద్ హీరోగా లక్ష్యం.. లౌక్యం లాంటి చిత్రాల్ని తెరకెక్కించాడు. లౌక్యం హిట్ టాక్ తెచ్చుకుంది. బెల్లంకొండ శ్రీను హీరోగా 2018లో సాక్ష్యం చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. అంతకుముందు బాలయ్య తో తీసిన డిక్టేటర్ అంతంత మాత్రమే. కెరీర్ లో రామరామ కృష్ణ కృష్ణ.. పాండవులు పాండవులు తుమ్మెద లాంటి డిజాస్టర్లు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఒక ఫ్లాప్ డైరక్టర్ చేతి లో డెబ్యూ హీరోని పెడుతున్నారా? అన్న చర్చా సాగుతోంది.
ఒక కొత్త కుర్రాడిని తెరకు పరిచయం చేయాలంటే అంతో ఇంతో పాజిటివ్ వైబ్స్ కూడా అవసరం. ఆ కోణంలో చూస్తే ఫ్లాప్ దర్శకుడిని ఎంపిక చేయడానికి కారణమేంటి? అంటే .. శ్రీవాస్ చెప్పిన కథ పర్ఫెక్ట్ గా ఇంప్రెస్ చేసిందని అందుకే మారుతి స్థానంలో అతడిని ఎంపిక చేశారని తెలుస్తోంది. శ్రీవాస్ తెరకెక్కించిన వాటిలో మాస్ యాక్షన్ చిత్రాలే ఎక్కువ కాబట్టి .. డీవీవీ నట వారసుడిని ఆ తరహా కథాంశంతోనే పరిచయం చేస్తున్నాడా? అన్నది చూడాలి. మారుతి ఇప్పటికే జీఏ2 బ్యానర్ లోనే మరో చిత్రానికి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.