Begin typing your search above and press return to search.

'హ‌నుమాన్‌' డైరెక్ట‌ర్ కి దాన‌య్య కొత్త బాధ్య‌త‌లు

By:  Tupaki Desk   |   20 March 2022 1:30 PM GMT
హ‌నుమాన్‌ డైరెక్ట‌ర్ కి దాన‌య్య కొత్త బాధ్య‌త‌లు
X
క్రేజీ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌తో `ఆర్ ఆర్ ఆర్‌` వంటి భారీ చిత్రాన్ని నిర్మించి టాక్ ఆఫ్ ది ఇండియా గా మారిన ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య‌. గ‌త కొంత కాలంగా త‌న వార‌సుడిని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇందు కోసం చాలా మంది ద‌ర్శ‌కుల‌ని సంప్ర‌దించారు. అయితే ఏ డైరెక్ట‌ర్ తోనూ సెట్ కాలేదు. ఫైన‌ల్ గా త‌న కొడుకు క‌ల్యాణ్ ని హీరోగా ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ల్ని యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు అప్ప‌గించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే వార‌సులు వీర విహారం చేస్తున్న నేప‌థ్యంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య త‌న త‌న‌యుడు క‌ల్యాణ్ ని కూడా హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇందు కోసం చాలా మంది డైరెక్ట‌ర్ ల‌ని ప‌రిశీలించారు. ఎంతో మంది క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు కానీ ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో చివ‌రికి యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ని ఫైన‌ల్ చేసుకున్నారు.

ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌స్తుతం ఇండియ‌న్ రియ‌ల్ సూప‌ర్ హీరో `హ‌ను మాన్‌` పేరుతో ఓ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ మూవీని స‌రికొత్త ప్ర‌పంచం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

తేజ స‌జ్జ హీరోగా న‌టిస్తున్న ఈమూవీని స‌రి కొత్త వ‌ర‌ల్డ్ నేప‌థ్యంలో ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు.ఈ మూవీ పూర్త‌యిన త‌రువాత డీవీవీ దార‌య్య త‌న‌యుడు క‌ల్యాణ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సినిమాని సెట్స్ పైకి తీసుకొస్తాడ‌.

ఈ మూవీ కోసం క‌ల్యాణ్ యాక్టింగ్‌, ఫైట్స్ , డ్యాన్స్ కు సంబంధించి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటున్నార‌ట‌. అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెర‌పైకి తీసుకు రానున్నార‌ట‌. యంగ్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి ప‌ని చేయ‌బోతున్నార‌ని, ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌య‌ని, మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని తెలిసింది.