Begin typing your search above and press return to search.
నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడు దామోదర ప్రసాద్
By: Tupaki Desk | 19 Feb 2023 4:36 PMనిర్మాతల మండలి ఎన్నికలు ముగిసాయి. అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ గెలుపొందారు. 339 ఓట్లతో తన ప్రత్యర్థి ప్యానెల్ అభ్యర్థి జెమిని కిరణ్ పై దాము అలియాస్ దామోదర ప్రసాద్ మెజారిటీ సంపాదించారు. 315 ఓట్లతో జెమినీ కిరణ్ తన ప్రత్యర్థికి పోటాపోటీగా నిలిచారు. అయితే హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కిప్రోగ్రెస్సివ్ నిర్మాతల గిల్డ్ కి చెందిన దిల్ రాజు బృందం అండగా నిలవగా కేవలం 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందారు. జెమిని కిరణ్ కి మాజీ అధ్యక్షుడు సి.కళ్యాణ్ బృందం అండగా నిలిచారు.
ఉపాధ్యక్ష పదవికి సుప్రియ - అశోక్ లు ఏకగ్రీవం అవ్వగా.. ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు. హనరబుల్ సెక్రెటరీ గా ప్రసన్న కుమార్ (378 ఓట్లు) గెలుపొందగా.. 362 ఓట్లతో వైవియస్ చౌదరి గెలుపొందారు. జాయింట్ సెక్రెటరీలు గా భారత్ చౌదరి 412 ఓట్లతో గెలుపు గుర్రమెక్కారు. అలాగే చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన నిర్మాత నట్టి కుమార్ 247 ఓట్లతో గెలుపొందారు.
ఈసీ మెంబర్స్ గా దిల్ రాజు (470 ఓట్లు)- దానయ్య (421 ఓట్లు) - రవి కిషోర్ (419 ఓట్లు) -యలమంచిలి రవి (416 ఓట్లు) - పద్మిని (413 ఓట్లు) - బెక్కం వేణుగోపాల్ (406 ఓట్లు)- సురేందర్ రెడ్డి (396 ఓట్లు)-గోపీనాథ్ ఆచంట (353 ఓట్లు)- మధుసూదన్ రెడ్డి (347 ఓట్లు)- కేశవరావు (323 ఓట్లు)- శ్రీనివాస్ వజ్జ (306 ఓట్లు) -అభిషేక్ అగర్వాల్ (297 ఓట్లు)- కృష్ణ తోట (293 ఓట్లు)- రామకృష్ణ గౌడ్ (286 ఓట్లు)- కిషోర్ పూసలు (285 ఓట్లు) గెలుపొందారు. కొత్త ప్యానెల్ 2023-2025 సీజన్ కి మండలి కార్యనిర్వహణకు బాధ్యత వహిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.