Begin typing your search above and press return to search.

'కరోనా'‌ తెలుగు అమ్మడు బోల్డ్‌ పాత్రలకు ఓకేనట

By:  Tupaki Desk   |   11 Dec 2020 10:00 PM IST
కరోనా‌ తెలుగు అమ్మడు బోల్డ్‌ పాత్రలకు ఓకేనట
X
రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో ఎంతో మంది హీరోయిన్స్‌ ను పరిచయం చేశాడు. వారిలో చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకోగా కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలకే కనిపించకుండా పోయారు. నేడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'కరోనా వైరస్‌' సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమాలో కీలక పాత్రలో దక్షి గుత్తికొండ నటించారు. ఆ సినిమా దక్షి తమిళ అమ్మాయిగా.. ఒక తెలుగింటికి కోడలిగా నటించింది. సినిమాలో ఈమె పాత్ర కాస్త బోల్డ్‌ గా ఉంటుందట. నేడు విడుదల సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్తు ప్రణాళికలను గురించి చెప్పుకొచ్చింది.

వర్మ సినిమా అంటే సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు అయితే వస్తుంది. అయితే తదుపరి ఆఫర్లు రావడంను బట్టి వీళ్లు ఇండస్ట్రీలో సెట్‌ అయ్యేది లేనిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుగు అమ్మాయి అయిన దక్షి వరుసగా టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల సినిమాల్లో నటించాలని భావిస్తుందట. పాత్ర డిమాండ్‌ చేస్తే.. కథ కోరితే బోల్డ్‌ గా నటించేందుకు సైతం సిద్దం అన్నట్లుగా ఈ అమ్మడు చెబుతోంది. క్యారెక్టర్ల ఎంపిక విషయంలో తాను ఎలాంటి కండీషన్స్‌ పెట్టాలని భావించడం లేదు. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యం అంటూ దక్షి అంటోంది. కరోనా వైరస్‌ విడుదల తర్వాత ఈ అమ్మడికి ఎలాంటి గుర్తింపు వస్తుంది.. ముందు ముందు ఎలాంటి సినిమాల్లో ఈమెకు ఆఫర్లు వస్తాయో చూడాలి.