Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః అందాల ఆరబోతతో 'హుషారు' ఎత్తిస్తుంది

By:  Tupaki Desk   |   24 March 2021 9:30 AM GMT
ఫొటోటాక్‌ః అందాల ఆరబోతతో హుషారు ఎత్తిస్తుంది
X
తెలుగు ప్రేక్షకులకు హుషారు మరియు జాంబీరెడ్డి సినిమాలతో మరింత చేరువ అయిన దక్ష నగర్కర్‌ తన అందాలతో ఆకట్టుకుంటూ ఉంది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు ఎప్పుడు కూడా అడ్డు చెప్పడం లేదు. పాత్రకు తగ్గట్లుగా అందాలను ఆరబోసేందుకు ఎప్పుడు కూడా ఈ అమ్మడు ముందు ఉంటుంది. సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో కూడా అందాల ఆరబోత విషయమై ముందు ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు అందాల ఆరబోతకు నిదర్శణం అన్నట్లుగా మరో ఫొటోను షేర్‌ చేసింది. క్లీవేజ్ షో తో రెచ్చగొట్టే విధంగా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

షర్ట్‌ విప్పి తన అందాలను చూపిస్తూ ఉన్న ఈ అమ్మడి ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నేను నన్ను ఇంప్రెస్ చేసుకునేందుకు మాత్రమే డ్రస్‌ చేసుకుంటాను అంటూ ఈ ఫొటోకు కామెంట్‌ పెట్టింది. నెటిజన్స్‌ ను కవ్వించేందుకు షేర్‌ చేసిన ఈ ఫొటోకు అలాంటి కామెంట్‌ పెట్టడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్ల కోసం అందాల ప్రదర్శణ చేస్తున్నారా అంటూ కొందరు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటోలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి కాని ఈసారి మరింత హాట్‌ గా ఉన్నాయంటూ టాక్‌ వినిపిస్తుంది.