Begin typing your search above and press return to search.

RRR దెబ్బకు ఇన్స్టా ఫాలోయర్లు పెరిగారు!

By:  Tupaki Desk   |   19 March 2019 5:42 AM GMT
RRR దెబ్బకు ఇన్స్టా ఫాలోయర్లు పెరిగారు!
X
ఇది సోషల్ మీడియా జమానా. పాపులారిటీ దక్కించుకునేందుకు దశాబ్దాలు పట్టదు. జస్ట్ ఒక్క టర్నింగ్ పాయింట్ మిమ్మల్ని పాపులర్ సెలబ్రిటీగా మార్చేస్తుంది. ఇప్పుడు బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ విషయంలో అలానే జరిగింది. ఎప్పుడైతే ఎస్ ఎస్ రాజమౌళి తన కొత్త సినిమా 'RRR' లో ఎన్టీఆర్ కు జోడీగా డైసీ పేరు ప్రకటించాడో.. మరుక్షణమే భారతదేశం అంతా అమ్మడి పేరు మార్మోగిపోయింది.

ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సదరు బ్యూటీ మరింత ప్రత్యేకంగా మారింది. డైసీ సోషల్ మీడియా ఖాతాలలో ఫాలోయింగ్ పెరిగింది. ఇన్స్టాలో అయితే ఫాలోయింగ్ పెరగడమే కాదు టాలీవుడ్ కు స్వాగతమిస్తూ ఎంతోమంది ఎన్టీఆర్ అభిమానులు మెసేజులు పెడుతున్నారు. కొత్తవి పాతవి అని తేడాలేకుండా డైసీ పాత ఇన్స్టా పోస్టులలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై అమిత ప్రేమను కురిపిస్తున్నారు. ఒకరు 'RRR కు అల్ ది బెస్ట్.. టాలీవుడ్ కు వెల్కమ్' అన్నారు.. ఇంకొకరు 'మేడమ్ మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు. తారక్ అన్నతో చేసే RRR తో మీకు పెద్ద విజయం లభిస్తుంది' అన్నారు. ఒక నెటిజనుడైతే ఏకంగా 'కంగ్రాట్స్ డైసీ ఎడ్గార్ జోన్స్. మీరు RRR అనే గ్రేట్ బ్లాక్ బస్టర్ మూవీ సైన్ చేశారు' అంటూ తేల్చేశాడు.

డైసీ ఎడ్గర్ జోన్స్ పేరు RRR ప్రెస్ మీట్ లో ప్రకటించక మునుపు ఇండియాలో పెద్దగా ఎవరికీ తెలీదు. ఆమె నటించిన 'కోల్డ్‌ ఫీట్‌'.. 'వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌' లాంటి టీవీ సిరీస్ ల గురించి తెలిసివ వారికి మాత్రమే ఆమె పేరు తెలుసు. ఇప్పుడు మాత్రం ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సాధించిన ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ రేంజ్ రిసెప్షన్ అమ్మడు ఊహించిందో లేదో!