Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై రోజుకో పుకారు..!
By: Tupaki Desk | 31 May 2021 12:22 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పలు పాన్ ఇండియన్ సినిమాలు లైన్ లో పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే 'రాధే శ్యామ్' చిత్రాన్ని ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చిన ప్రభాస్.. 'సలార్' 'ఆదిపురుష్' సినిమాల షూటింగ్స్ చేస్తున్నారు. ఇదే క్రమంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేసుకున్నారు. ఇలా భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి రోజుకో రూమర్ వినిపిస్తూనే ఉంది.
తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 'ఛత్రపతి' సినిమా కోసం కలిసిన జక్కన్న - ప్రభాస్.. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారు. దీంతో వీళ్ళ కాంబోకు ఏర్పడిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మళ్ళీ కలవబోతున్నారని అంటున్నారు.
ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రాజమౌళి.. తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు. అయితే మహేష్ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తారని టాక్. అలానే డార్లింగ్ తో 'సలార్' సినిమా చేస్తున్న 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా ఆయనతో మరో సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ తో సినిమా కంప్లీట్ అయిన తరువాత ప్రభాస్ సినిమా గురించి ప్రశాంత్ ఆలోచిస్తారని టాక్ నడుస్తోంది.
ఇదిలావుంటే 'ఆదిపురుష్' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న ప్రభాస్.. మరో స్ట్రెయిట్ హిందీ మూవీ చేయనున్నాడట. బాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ ఒక ‘రా ఏజెంట్’ గా కనిపించనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రభాస్ తదుపరి సినిమాల గురించి రోజుకో రూమర్ వస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే ఇందులో ఏ ఒక్క దానిపై కూడా క్లారిటీ లేదు. మరి ఇవన్నీ పుకార్లు మాత్రమేనా లేక నిజమవుతాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది.