Begin typing your search above and press return to search.

ఫిలిం ఛాంబర్: సురేష్ బాబే గెలిచారు

By:  Tupaki Desk   |   20 July 2015 3:54 AM GMT
ఫిలిం ఛాంబర్: సురేష్ బాబే గెలిచారు
X
తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఎన్నికలు అనుకున్నట్లే ముగిసాయి. ఇకపొతే అన్ని ప్యానెల్స్ లో పాపులర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు తన ఆధిపత్యం చూపించారు. ఆయనే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి అధ్యక్షుడయ్యారు. ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ లో జరిగాయి. స్టూడియో, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ప్రొడక్షన్ సెక్టర్స్ కు ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు సెక్టార్ల ఎన్నికలకు నిర్మాతలు - ఎగ్జిబిటర్లైన డి. సురేశ్ బాబు, దిల్ రాజుల సారథ్యంలోని ఒక ప్యానెల్, నిర్మాతలు నట్టికుమార్, టి. ప్రసన్నకుమార్ల నేతృత్వంలోని మరో ప్యానెల్ పోటీపడ్డాయి. మొత్తంగా సురేశ్ బాబు ప్యానెల్ సభ్యులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. ఇక ఉపాధ్యక్షులు గా దిల్ రాజు, ఎం రమేష్, పి కిరణ్ లు ఎన్నికయ్యరు. అయితే రెబెల్స్ గా పోటి చేసిన నట్టి కుమార్, ప్రసన్న కుమార్ వంటి నిర్మాతలకు నామ మాత్రపు విజయాలు కూడా దక్కలేదు.

కామెంట్: అసలు ఆ నలుగురు ఆ నలుగురూ అంటూ చాలా మంది హడావుడి చేస్తుంటారు. ఇంతకీ వాళ్ళందరూ గెలుస్తుంటే మిగిలిన వారు ఏం చేస్తున్నారు? ఆ నలుగురి ని ఓడించకుండా వారినే ఎందుకు ఎన్నుకున్నరూ? దీనిబట్టి చూస్తుంటే ఆ నలుగురు అంటూ ఎడవటమే కాని నిజంగా అక్కడ ఏమి లెదనమాట. ఎందుకు గురు గొడవలు, అందరు హ్యాపీ గ కలిసి వుండే దానికి..