Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు మేన‌త్త బ‌ర్త్ డే గ్రీటింగ్స్‌

By:  Tupaki Desk   |   20 May 2021 6:52 AM GMT
ఎన్టీఆర్ కు మేన‌త్త బ‌ర్త్ డే గ్రీటింగ్స్‌
X
ఇవాళ జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే. ఈ స్పెష‌ల్ డే ఫ్యాన్స్ కు పండ‌గే అని చెప్ప‌డంలోసందేహ‌మే లేదు. అందుకే.. ఒక రోజు ముందుగానే సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ చేశారు అభిమానులు. ట్విట‌ర్ లో ‘ఎన్టీఆర్‌’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లో ఉంచారు. కొవిడ్ నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాల‌ని చెప్ప‌డంతో.. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటు ఫ్యాన్స్ తోపాటు.. అటు సినీ, పొలిటిక‌ల్ సెల‌బ్రిటీస్ శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. జూనియ‌ర్ మేన‌త్త, ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కురాలు పురందేశ్వ‌రి కూడా బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు. ‘‘నువ్వు చాలా స్పెషల్. అందుకే నీ మనోహరమైన ముఖంపై ఎల్ల‌ప్పుడూ చిరునవ్వు చిందుతూ ఉండాలి. హ్యాపీబ‌ర్త్ డే రాక్ స్టార్‌’’ అని పోస్టు చేశారు.

కాగా.. కొవిడ్ బారిన పడిన తారక్ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంలో ఉన్న‌ప్ప‌టికీ.. బ‌ర్త్ డే వేళ సోష‌ల్ మీడియా వేదిక‌గా సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. జూనియ‌ర్ కోలుకోవాల‌ని పూజ‌లు కూడా చేస్తున్నారు.