Begin typing your search above and press return to search.

ఊరూ వాడా ఇక ద‌గ్గుబాటి మినీ స్టూడియోస్ .. మీ సినిమా మీరే తీసేయొచ్చు!

By:  Tupaki Desk   |   19 July 2021 6:30 AM GMT
ఊరూ వాడా ఇక ద‌గ్గుబాటి మినీ స్టూడియోస్ .. మీ సినిమా మీరే తీసేయొచ్చు!
X
కాలంతో పాటే మార్పు. జ‌నం ఇక‌పై థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూడక‌పోవ‌చ్చు. కేవ‌లం హై క్వాలిటీతో ర‌న్ అయ్యే సూప‌ర్ థియేట‌ర్ల‌కు మాత్ర‌మే వెళ‌తారు. అదే స‌మ‌యంలో ఓటీటీల్లో వీక్షించేందుకు జ‌నం ఆస‌క్తిగా ఉంటారు! ఇది టాలీవుడ్ అగ్ర‌నిర్మాత‌.. ది గ్రేట్ డీన్ డి.సురేష్ బాబు ప‌లికిన భ‌విష్య‌వాణి.

ఆయ‌న నోటి నుంచి జారి ప‌డే ఒక్కో ప‌దం 2000 క‌రెన్సీ నోటు లాంటిది. దానిని ఏరుకున్న వాళ్ల‌కు ఏరుకున్నంత‌. అందుకే ఆయ‌న చెప్పిన మ‌రో ముచ్చ‌ట కూడా అంతే ఆస‌క్తిని పెంచుతోంది. ఆయ‌న ఆలోచ‌న‌లు ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ కి నూత‌న ట్యాలెంట్ కి ఒక వ‌రంగా మార‌నుంద‌న‌డానికి ఇది సంకేతం. ఇక‌పై కేవ‌లం సినిమా వీక్ష‌ణ మాత్ర‌మే కాదు.. మునుముందు సినిమా తీసే విధానం కూడా అమాంతం మారిపోనుందని అర్థ‌మ‌వుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ మినీ స్టూడియోలు ఏర్పాటు చేసుకుని ఎవ‌రికి వారు సినిమాలు తీసుకోవ‌చ్చ‌ని కూడా ఆయ‌న మార్గ‌నిర్ధేశ‌నం చేస్తున్నారు.

తొలిగా తెలుగు రాష్ట్రాల్లో మినీ స్టూడియోల ఏర్పాటు కోసం స‌న్నాహ‌కాల్లో ఉన్నామ‌ని డి.సురేష్ బాబు తెలిపారు. అంటే ఏరియా ప్రాంతాన్ని బ‌ట్టి మినీ స్టూడియోల‌ను ఏర్పాటు చేసి ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ ని ఎంక‌రేజ్ చేయాల్న‌ది సురేష్ బాబు ప్లాన్. స్థానికంగానే స్టూడియోల ఏర్పాటుతో యువ‌త‌రం వినోదం వైపు మ‌రింత‌గా ఆక‌ర్షితం కానుందనేది ఆయ‌న అంచ‌నా.

అగ్ర‌ నిర్మాత కం బిజినెస్ మేన్ సురేష్ బాబు మారిన కాలాన్ని బ‌ట్టి త‌న బిజినెస్ వ్యూహాన్ని మార్చుకున్నారు. టెక్నాలజీ వినోదం ముఖాన్ని మార్చిందనేది ఆయ‌న అభిప్రాయం. ఇక‌పై ఆయ‌న వెబ్ సిరీస్ లతో పాటు చిన్న చిత్రాల సమూహాన్ని నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. ఈ డిజిటల్ యుగంలో ఎవరైనా తమ స్వంత కంటెంట్ ను తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్ లలో పోస్ట్ చేయవచ్చు. ఓవ‌ర్ నైట్ లోనే జనాదరణ పొందవచ్చు. యువతకు ఔత్సాహిక చిత్రనిర్మాతలకు మద్దతుగా సురేష్ ప్రొడక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో మినీ స్టూడియోలను నిర్మిస్తుంది.. అని సురేష్ బాబు తెలిపారు.

తిరుపతి- అమరావతి- వైజాగ్ లలో వీటిని త్వరలో ప్రారంభిస్తారు. ఇక‌పై ప్రారంభించే మినీ స్టూడియోలన్నింటిలో చిన్న సైజ్ డిజిట‌ల్ సినిమా విస్త‌రించే ప్ర‌ణాళిక ఉంటుంది. వెబ్ సిరీస్ లు ఇందులో భాగం. వీటిలో డబ్బింగ్ థియేటర్లు .. పాటల‌ రికార్డింగ్ సౌక‌ర్యం ఉంటుంది. ఈ స్టూడియోల్లో త‌క్కువ ఖ‌ర్చుతోనే అన్ని ప‌నులు పూర్తి చేసుకునే వీలుంటుంది. ఈ స్టూడియోలు రాబోవు మూడు నెలల్లో పనిచేస్తాయి.

కంటెంట్ ఉండే చిన్న సినిమాలు.. వెబ్ సిరీస్ లను రూపొందించడానికి సురేష్ బాబు పలువురు నిర్మాతలతో కలిసి పనిచేస్తున్నారు. భారీ చిత్రాల కోసం దిగ్గ‌జ కంపెనీల‌తో క‌లిసి ఆయ‌న ప‌ని చేయ‌నున్నారు. హైదరాబాద్ వైజాగ్ లలో రామానాయుడు స్టూడియోస్ ఇక‌పై త‌మ సొంత సంస్థ‌ల సినిమాల‌తోనే బిజీ అయిపోతాయి. ఇత‌రుల‌కు స్పేస్ ఇవ్వాలంటే చాలా ముందుగా తేదీలు అడ‌గాల్సినంత‌గా ఈ స్టూడియోలు ర‌ష్ తో ఉంటాయి. అప‌రిమితంగా అవ‌కాశాల్ని క‌ల్పించే వెబ్ సిరీస్ డిజిట‌ల్ కంటెంట్ పై సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ పూర్తి స్థాయిలో దృష్టి సారించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఒక ర‌కంగా రాష్ట్ర ప్ర‌భుత్వాల సాయం అక్క‌ర్లేకుండానే సినిమా ఇండ‌స్ట్రీని ర‌న్ చేసే ప్యార‌ల‌ల్ వ్యూహ‌మిద‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.