Begin typing your search above and press return to search.
సమంతతో పెళ్లికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?
By: Tupaki Desk | 19 Jun 2016 9:00 PM ISTనెమ్మదిగా తెరలు వీడిపోతున్నాయి. సమంత-నాగచైతన్యల పెళ్లి విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ ఎదుర్యేలా లేవు. ఇరు కుటుంబాల నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే కనిపిస్తోంది. స్వయంగా నాగార్జునే తన కోస్టార్ అయిన అమలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాగచైతన్య విషయంలో అతను అభ్యంతర పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు రామానాయుడు ఫ్యామిలీలో కూడా దదాపుగా అందరూ ఓకే చెప్పేశారు. తాజాగా చైతూ తల్లి లక్ష్మి కూడా కొడుకు పెళ్లికి పచ్చ జెండా ఊపేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఆమె చెన్నైకి వచ్చి సమంతతో ఒక రోజంతా గడిపినట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సమంతతో ప్రేమాయణం గురించి చైతూ తన తల్లికి ఇన్ఫామ్ చేశాడట. ఆమె స్వయంగా ఓసారి తనను కలుస్తానని చెప్పి అందుకోసమే చెన్నైకి వచ్చి ప్రత్యేకంగా ఆమెతో ఒకరోజంగా గడిపి.. తనను పరిశీలించిందట. తనకు కాబోయే అత్తగారి దగ్గర సమంత బాగానే మార్కులు కొట్టేసినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది ఆఖర్లో కానీ.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ.. చైతూ-సమంత పెళ్లి పీటలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల ‘బ్రహ్మోత్సవం’ ప్రమోషన్లలో భాగంగా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నానంటూ సమంత కొన్ని హింట్లివ్వడం.. ఆ హింట్లతో ఇండస్ట్రీ జనాలందరూ చైతూనే ఆ హీరో అన్న అంచనాకు వచ్చేయడం తెలిసిందే. ఐతే చైతూ మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా పెదవి విప్పలేదు.